Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఢిల్లీ టూ గల్లీ, ఎంపీగా అభివృద్ధికి పట్టం - ట్రాక్ రికార్డే నిదర్శనం..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం హోరెత్తుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్దులు ప్రచారంలోకి దిగారు. ఈ సారి ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన తమ తొలి జాబితాను ప్రకటించాయి. బీజేపీతో పొత్తు పైన స్పష్టత వచ్చిన తరువాత ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు మూడు ఎంపీ స్థానాలు కేటాయించారు. మచిలీపట్నం నుంచి బాలశౌరి పోటీ చేయనున్నారు. ఆయన ట్రాక్ రికార్డు చూస్తేనే ఈ సారి ఆయన గెలుపు ఖాయమని జనసేన నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

జనసేన అభ్యర్దిగా: పొత్తులో భాగంగా జనసేన మూడు ఎంపీ స్థానాల నుంచి పోటీ చేయనుంది. అందులో భాగంగా మచిలీపట్నంలో 2019లో వైసీపీ నుంచి గెలిచిన వల్లభనేని బాలశౌరి ఇప్పుడు జనసేన నుంచి బరిలోకి దిగటం దాదాపు ఖాయమైంది. అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. తొలి సారి ఎంపీ అయిన సమయం నుంచే ఢిల్లీ నుంచి తన నియోజకవర్గంలోని గల్లీ వరకు ప్రతీ సందర్భంలోనూ అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు.

MP Balasowri Recognised as Successful leader over Machilipatnam development

తెనాలి ఎంపీగా ఉన్న సమయంలో దివిసీమ పరిధిలోని దాదాపు 18వేల ఎకరాలు చెరువులుగా ఉంటే.. సొంత నిధులు వెచ్చించి ఆయా చెరువులను పూడ్పించి వాటిని చదును చేయించి సాగు భూములుగా మార్చిన నాయకుడిగా ఎంపీ బాలశౌరి గారు చిరస్థాయిగా నిలిచిపోయారు. తెనాలిలో తాగునీటి సమస్య పరిష్కారానికి కొన్ని కోట్ల రూపాయలు కేటాయించి ప్రతి ఇంటికీ తాగునీటిని అందజేశారు.

స్పష్టమైన విజన్ తో: తెనాలిలో ముస్లిం సోదరుల కోసం షాదీఖానాను ఏర్పాటు చేయించారు. రేపల్లె నుంచి హైదరాబాద్‌ కాచిగూడ వరకు డెల్టా ఫాస్ట్‌ ప్యాసింజర్‌ రైలును తీసుకొచ్చిన ఘనత ఎంపీ బాలశౌరిదే. దీంతోపాటు ఈ డెల్టా ట్రైన్‌ టిక్కెట్టు ధర హైదరాబాద్‌కు కేవలం 40 రూపాయలకు ఆ రోజుల్లో అతి తక్కువకే అందుబాటు లోకి తీసుకొచ్చారు. రాజీవ్‌ పల్లెబాట పేరుతో మచిలీపట్నం పరిధిలోని నిడుమోలు, అవనిగడ్డ, తదితర గ్రామాల్లో రోడ్లు వేయించారు.

కృష్ణాడెల్టా జీవధారగా పిలుచుకునే పులిచింతల ప్రాజెక్టు నిర్మాణంలో ఎంపీ బాలశౌరి చాలా చురుగ్గా పాల్గొన్నారు. ప్రాజెక్టు నిర్మాణం ఆపివేయాలని ఎంపీ బాలశౌరికి నక్సలైట్ల బెదిరింపులు వచ్చాయి. అయినా కూడా వాటిని లెక్కచేయకుండా ప్రాజెక్టును పూర్తి చేయించారు. ఇక ప్రాజెక్టు శంకుస్థాపన రోజు ప్రస్తుత పల్నాడు జిల్లా మోర్జంపాడు అనే గ్రామంలో ఉన్న ఎంపీ బాలశౌరి ఇంటిని నక్సలైట్లు డైనమైట్లు పెట్టి పేల్చివేసి ఇంటిని నేలమట్టం చేశారు. ఈ సంఘటన నాడు సంచలనంగా నిలిచింది.

MP Balasowri Recognised as Successful leader over Machilipatnam development

ప్రణాళికాబద్దంగా అడుగులు: మచిలీపట్నం ఎంపీగా పోర్టు తీసుకురావటంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఢిల్లీలోని కేంద్ర పెద్దలతో బాలశౌరికి సత్సంబంధాలు ఉండటం కలిసొచ్చే అంశం. కేంద్రంలో రాజకీయ, పారిశ్రామిక దిగ్గజాలతో ఉన్న మంచి సంబంధాలతో సీఎస్ఆర్ నిధులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలిగారు. ఏ అంశం పైన అయినా స్పష్టమైన విజన్ తో ముందుకెళ్తారనే గుర్తింపు ఉంది.

మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో గ్రామాల రూపురేఖలు మార్చటంతో పాటుగా నియోజకవర్గం మొత్తం అభివృద్ధి దిశగా పూర్తి ప్రణాళికలతో సిద్దమయ్యారు. ఇప్పటికే పార్లమెంట్ నియోకవర్గ పరిధిలో అన్ని స్థాయి నేతలతో అనుబంధం.. పవన్ కల్యాణ్ మద్దతు అదనపు బలంగా మారుతోంది. అధికార వైసీపీ ఇప్పటికీ మచిలీపట్నం ఎంపీ అభ్యర్దిని ప్రకటించలేదు. నియోజకవర్గం పైన పూర్తి పట్టు..స్పష్టమైన విజన్ తో ముందుకెళ్తున్న బాలశౌరి తన విజయం పైన ధీమా వ్యక్తం చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+