ఎన్నికల వేళ ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్..!?
ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఏపీ(AP)లో విశాఖ కేంద్రంగా కీలక పరణామాలు చోటు చేసుకుంటున్నాయి. విశాఖ(Vizag) నుంచి పాలన ప్రారంభించేందుకు సీఎం జగన్ సిద్దం అయ్యారు. ఇదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్(Steel Plant) ప్రయివేటీకరణ అంశం పైన తాజాగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు(GVL Narasimha Rao) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పడిప్పుడే జరగదని చెప్పుకొచ్చారు. ఇదే అంశంపై కీలక విషయాలను వెల్లడించారు.
కేంద్రం వరుస నిర్ణయాలు: ఏపీకి సంబంధించి కేంద్రం ఈ మధ్య కాలంలో వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. ఆర్దికంగా ప్రభుత్వ వినతుల పైన సానుకూలంగా స్పందిస్తున్న కేంద్రం..విశాఖను నీతి అయోగ్(Neeti Ayog) గ్రోత్ హబ్ సిటీ జాబితాలో చేర్చారు. తాజాగా రాష్ట్రానికి ఎనిమిది కేంద్రీయ విద్యాలయాలను కేటాయించింది. ఇక, కొంత కాలంగా విశాఖ స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant) ప్రయివేటీకరణ అంశం రాజకీయ వివాదంగా మారింది.

దీని పైన అనేక చర్చలు..వినతులు..నిరసనలు జరిగాయి. ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) ప్రధాని మోదీ(PM Modi)కి స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నిలుపుదల చేయాలని లేఖ రాసారు. స్టీల్ ప్లాంట్ ప్రయిటీకరణ నిర్ణయం పైన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ హైకోర్టులో కేసు దాఖలు చేసారు.
జీవీఎల్ వ్యాఖ్యలతో: ఇప్పుడు ఇదే స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ పైన ఎంజీ జీవీఎల్(MP GVL) చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పడిప్పుడే జరగదని ఆయన అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం పునరాలోచన చేస్తోందని, యథాతథ స్థితిని కొనసాగించేలా కేంద్రం నుంచి సంకేతాలు వచ్చాయని వెల్లడించారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ(Vizag Steel Plant) అమ్మకం దాదాపు నిలిచిపోయినట్టేనని, అయితే, సంస్థను లాభాల బాటలో నడిపించాల్సి ఉందని, అప్పుడు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగుతుందని అన్నావిశాఖ స్టీల్ ప్లాంట్ అంశం ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్తానని ఎంపీ జీవీఎల్ తెలిపారు. స్టీల్ ప్లాంట‌్(Steel Plant)ను లాభసాటిగా నడిపించాలనేది తమ ప్రయత్నమన్నారు. స్టీల్ ప్లాంట్ 30 వేల మంది ఉద్యోగులది మాత్రమే కాదు.. ప్రజల ఆస్తి అని జీవీఎల్ అన్నారు. యాజమాన్యం పట్టించుకోకపోవడం వల్లే స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని చెప్పుకొచ్చారు.

ప్రయివేటీకరణ ఆగినట్లేనా: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రజల ఆస్తి అని, పరిశ్రమను కాపాడుకోవడం అందరి బాధ్యత అని జీవీఎల్(GVL) పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు పరిశ్రమ నష్టాలకు, ఐరన్ ఓర్ గనులు కేటాయించకపోవడానికి మోదీ సర్కారుదే బాధ్యత అనడం తగదని పేర్కొన్నారు. కాంగ్రెస్(Congress) హయాంలో గత యాజమాన్యం వల్లే సంస్థకు ఇబ్బందులు వచ్చాయని వివరించారు. ప్రభుత్వ రంగంలోనే సంస్థ నిర్వహణ ఉండేందుకు తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు జీవీఎల్.
అదే ప్రస్తుతానికి తమ కార్యాచరణ అని ఆయన చెప్పారు. స్టీల్ ప్లాంట్‌కు అవసరమైన గనుల కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. స్టీల్ ప్లాంట్(Steel Plant)కు ఐరన్ ఓర్ ఆగిపోయింది అని తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. దీంతో, స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రస్తుతానికి ఆగినట్లేనని ఇచ్చిన సంకేతాలు రిలీఫ్ గా మారుతున్నాయి.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications