వైసీపీలోకి ముదగ్రడ, అలా జరిగితేనే అడ్వాంటేజ్- మిథున్ రెడ్డి...!!

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పవన్ కల్యాణ్ వారాహి యాత్ర లో వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. దీంతో వైసీపీ కౌంటర్ స్ట్రాటజీ అమలు చేస్తోంది. తాజాగా పవన్ లక్ష్యంగా ముద్రగడ లేఖలు రాసారు. పిఠాపురం నుంచి తన పైన పోటీ చేయాలని సవాల్ చేసారు. దీంతో ముద్రగడ వైసీపీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం మొదలైంది. ముద్రగడ ఎంట్రీ పైన గోదావరి జిల్లాల వైసీపీ ఇంఛార్జ్ ఎంపీ మిథున్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

ముద్రగడ ఎంట్రీ పక్కానా
గోదావరి జిల్లాలో పవన్ కల్యాణ్ యాత్ర వేళ కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం అదే సమయంలో అక్కడి నుంచే ముద్రగడ తన పైన పోటీ చేయాలని సవాల్ చేయటం రాజకీయంగా ఆసక్తిని పెంచింది. ముద్రగడ వైసీపీలోకి చేరిక ఖాయమంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.

MP Mithun Reddy

ముద్రగడతో వైసీపీ నేతలు మంతనాలు చేసారని చెబుతున్నారు. ఇప్పుడు ముద్రగడ పార్టీకి రావటం పైన గోదావరి జిల్లాల వైసీపీ ఇంఛార్జ్ మిథున్ రెడ్డి స్పందించారు. ముద్రగడ వైసీపీలోకి వస్తానంటే ఖచ్చితంగా ఆహ్వానిస్తామని తేల్చి చెప్పారు. ముద్రగడ పైన సీఎం స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

తెర మీదకు కొత్త లెక్కలు
చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని పవన్ కళ్యాణ్ పని చేస్తున్నారని మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు. అభిమానులు, ప్రజలు ను రెచ్చగొట్టి లబ్ది పొందాలని పవన్ చూస్తున్నారని విమర్శించారు. జనసేన ఎన్ని స్థానాలు లో పోటీ చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేసారు. కాకినాడ అంటే కాపులు అడ్డా అని మిధున్ రెడ్డి చెప్పుకొచ్చారు.

MP Mithun Reddy

రాబోయే ఎన్నికల్లో చట్ట సభలలో బీసీ లు, కాపులు ప్రాతినిధ్యం పెరుగుతుందని చెప్పారు. కాపు ఎమ్మెల్యేలు ను టార్గెట్ చేస్తే వ్యతిరేకత వస్తుందని పవన్ అభిప్రాయంతో ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇదే వ్యూహంతో కాకినాడలో ద్వారంపూడి ని విమర్శించారని వివరించారు. లోక్ సభ ఎన్నికల తో పాటు అసెంబ్లీ ఎన్నికలు కి వెళ్తేనే మాకు అడ్వాంటేజ్ ఉంటుందని మిథున్ రెడ్డి తేల్చి చెప్పారు.

గోదావరి జిల్లాలే కీలకం
షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయని మిథున్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన వేళ ముందస్తు ఎన్నికల పైన చర్చ జరిగిందని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. వైసీపీ నేతలు మాత్రం ఈ ప్రచారం ఖండిస్తున్నారు. ముందస్తుకు అవకాశం లేదని తేల్చి చెబుతున్నారు. ఇప్పుడు మిథున్ రెడ్డి ఇదే విషయం స్పష్టం చేసారు. పార్లమెంట్, అసెంబ్లీ కలిపి ఎన్నికలు జరిగితేనే అడ్వాంటేజ్ అని ఓపెన్ గా చెబుతున్నారు. ఈ సారి ఎన్నికల్లో గోదావరి జిల్లాలు కీలకం కావటంతో ఈ జిల్లాల పార్టీ సమన్వయకర్తగా మిథున్ రెడ్డి పాత్ర కీలకం కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+