వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ సోషల్ సైన్యం భారీ కుట్ర -జనం సొమ్ముతో రాక్షసం -ఖబడ్దార్ వెధవల్లారా: ఎంపీ రఘురామ సంచలనం

|
Google Oneindia TeluguNews

వైసీపీ దాఖలు చేసిన అనర్హత వేటు పిటిషన్ వ్యవహారం ఇప్పట్లో తేలే అవకాశాలు లేకపోవడంతో సొంత పార్టీపై, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శల పర్వం కొనసాగిస్తున్నారు. 'రాజధాని రచ్చబండ'పేరుతో దాదాపు రోజూ ప్రెస్ మీట్ నిర్వహించే ఆయన గత 20 రోజులుగా అనారోగ్యకారణాల వల్ల స్పీడు తగ్గించారు. గుండెకు సంబంధించిన సమ్యలు రావడంతో ముంబైలో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. ఆపరేషన్ విజయవంతమైందని ఆయన ప్రకటించిన తర్వాతకూడా సొంత పార్టీ సోషల్ మీడియాలో తీవ్ర ప్రచారం జరుగుతుండటంపై రఘురామ స్పందించారు.

జగన్ అనుంగుల డ్రగ్స్ వాడకం..

జగన్ అనుంగుల డ్రగ్స్ వాడకం..

సీఎం జగన్ ఒక్కోసారి ఒక్కోలా వ్యవహరిస్తూ అదోరకం ఇంబ్యాలెన్స్‌లో ఉంటారని, అధికార వైసీపీకి చెందిన, జగన్ కు చాలా దగ్గరగా ఉండే నేతలు తమ మానసిక జబ్బుల కోసం ‘సైకోట్రోపిక్ డ్రగ్స్' వాడుతున్నారని, దీనికి సంబంధించి తన దగ్గర పక్కాగా సాక్ష్యాధారాలు ఉన్నాయని ఎంపీ రఘురామ అక్టోబర్ 9నాటి రచ్చబండలో సంచలనల ఆరోపణలు చేశారు. రాజ్యాంగం ప్రకారం మానసిక దౌర్బల్యం ఉన్నవాళ్లు ప్రజాప్రతినిధులుగా ఉండటానికి వీల్లేదని, జగన్ అనుమతిస్తే ఆ వ్యక్తుల పేర్లు కూడా బయటపెడతానని ఎంపీ గతంలో చెప్పారు. మళ్లీ ఇన్నాళ్లకు ‘మానసిక అస్వస్థత'పై రఘురామ కామెంట్లు చేశారు. జగన్ కోసమే పనిచేసే వైసీపీ సోషల్ మీడియా సైన్యాల్లోని కొందరి మానసిక పరిస్థితి అదుపు తప్పిందన్నారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా రఘురామ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

రఘురామకు తీవ్ర అస్వస్థత..

రఘురామకు తీవ్ర అస్వస్థత..

‘‘మా వైసీపీ.. అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగం వాళ్లు పనికిమాలిన వెధవల్లా తయార్యారు. ‘రఘురామకృష్ణంరాజు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు' అని తప్పుడు ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. ఒకే సామాజికవర్గానికి చెందిన ఓ మహిళా నేత, మరో ముగ్గురు మగ నాయకుల ఫొటోలతో ఆ ఫేక్ న్యూస్ వ్యాప్తిలోకి వచ్చింది. అవి చూసి ఇంకొందరు నా గురించి వికారమైన కామెంట్లు పెడుతూ రాక్షసానందం పొందుతున్నారు. నిజం చెప్పాలంటే నాకు హార్ట్ ఎటాక్ రానేలేదు...

డాక్టర్ రమాకాంత్ పాండే..

డాక్టర్ రమాకాంత్ పాండే..

గుండెపోటు రానప్పటికీ, వార్షిక ఆరోగ్య పరీక్షల్లో హార్ట్ లో బ్లాక్స్ ఉన్నట్లు తెలిసింది. ఆంజియానా అని అనేది చాలా మందికి అర్థంకాదు. అనుమానంతో టెస్టులు చేయించుకుంటే హార్ట్ లో బ్లాక్స్ గుర్తించారు. ముందుజాగ్రత్త చర్యగా, లాంగ్ టర్మ్ సొల్యూషన్ గా సర్జరీ చేయించుకున్నాను. ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్‌లో డాక్టర్ రమాకాంత్ పాండే నేతృత్వంలో బైపాస్ సర్జరీ విజయవంతంగా పూర్తిచేశారు. వెంకటేశ్వరస్వామి ఆశిస్సులు, నన్ను అభిమానించే ప్రజల ఆశీర్వాదాలతో నేనిప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. కానీ మా పార్టీవాళ్లు మాత్రం మానసిక రుగ్మతతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

ఏపీలో బీజేపీ సర్జికల్ స్ట్రైక్స్ -జగన్‌పై ‘క్రిస్మస్' బాంబు -జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు -పవన్‌కు షాక్ఏపీలో బీజేపీ సర్జికల్ స్ట్రైక్స్ -జగన్‌పై ‘క్రిస్మస్' బాంబు -జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు -పవన్‌కు షాక్

ముఖ్య నేత నుంచి కిందిదాకా..

ముఖ్య నేత నుంచి కిందిదాకా..

నా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ప్రచారం చేస్తోన్న దిక్కుమాలిన వైసీపీ సోషల్ మీడియా వెధవలు అలా కోరుకుంటున్నారు. మా వాళ్లు ఇంత చేతగాని వెధల్లా తయారయ్యారంటే ఇంత కంటే హాస్యాస్పదం లేదు. సర్జరీ తర్వాత నేను కోలుకున్నాను. మొన్ననే ఓ ఛానెల్ కు 45 నిమిషాల ఇంటర్వ్యూ ఇచ్చాను. రాబోయే రెండు మూడు రోజుల్లో మరికొన్ని ఇంటర్వ్యూలు ఇవ్వబోతున్నా. తద్వారా మా వైసీపీ సోషల్ సైన్యాల వాళ్ల మెదళ్లు ఎంతగా పాడైపోయాయో తెలుగు ప్రజలు అర్థం చేసుకోవాలి. వైసీపీలో మానసిక రుగ్మత అన్నది నిజం. టాప్ లెవెల్ నుంచి కిందిస్థాయి దాకా అది ఎంతలా విస్తరించిందో భవిష్యత్తులో అందరికీ అర్థమవుతుంది.

ప్రజాధనంతో పిచ్చివేషాలు..

ప్రజాధనంతో పిచ్చివేషాలు..

ప్రభుత్వ సొమ్ముతో, ప్రజా ధనంతో నడుస్తోన్న విచిత్రమైన వ్యవస్థ వైసీపీ సోషల్ మీడియా. జనాన్ని పీక్కుతింటోన్న వీళ్లు రాక్షసులకు ఏ మాత్రం తక్కువకారు. మీ దురాగతాలు అంతమయ్యే రోజు దగ్గర్లోనే ఉంది. ఖబర్దార్.. మై డియర్ సోషల్ మీడియా ఫ్రెండ్స్. మీ మనసు అర్థమైంది. మీగురించైనా సంపూర్ణ ఆరోగ్యంతో ఇంకా శక్తిపుంజుకుని.. మీ దురాగతాల నుంచి రాష్ట్రప్రజల్ని జాగృతం చేస్తా. ప్రజలు చైతన్యవంతులయ్యారు. మీ మానసిక రుగ్మతల్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. దయచేసి మారగలిగితే మారండి లేదా ప్రజలే మిమ్మల్ని మార్చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

 వైసీపీ నికృష్ట ప్రచారాలు నమ్మొద్దు..

వైసీపీ నికృష్ట ప్రచారాలు నమ్మొద్దు..

పార్టీ సోషల్ మీడియాలో ఎన్ని చెత్త రాతలు రాసినా, భారీ కుట్రలు చేసినా ఒకటి మాత్రం నిజం.. ఏపీకి రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుంది. రైతుల ఆందోళలకు డిసెంబర్ 17తో ఏడాది పూర్తవుతుంది. త్వరలోనే కోర్టు నుంచి మనం అనుకూల తీర్పు వినబోతున్నాం. అమరావతి విషంలో వైసీపీ ఎన్ని దుర్మార్గాలు, ప్లానింగ్స్ చేశారో తెలిసిందే. అయితే నిజమైన సత్యమేవ జయతే అంటే ఏమిటో తప్పక నిరూపణ అవుతుంది. మరోసారి నా అభిమానులకు చెప్పేది ఏంటంటే.. ఈ పిచ్చి వైసీపీ పనికిమాలిన వెధవలు, నీచనికృష్టుల తప్పుడు ప్రచారాలు విని ఎవరూ ఆందోళన చెందొద్దు. నేను చక్కగా ఉన్నాను. అందరికీ టచ్ లో ఉన్నాను. ప్రతిరోజూ ఏదోఒక సమయంలో ప్రజలతోనూ టచ్ లోకి వస్తాను'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.

English summary
narasapuram ysrcp mp raghurama krishnam raju slams cm jagan and ysrcp social media wing for spreading rumours over his health condition. raghurama warns YSRCP social media and assured his good health. as Amaravati stir to complete a year, mp said andhra capital will continue in amaravati only.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X