జైట్లీ ఓకే చెప్పారన్న రాయపాటి
చిత్తూరు: రాష్ట్రాభివృద్ధి కోసం మరిన్ని నిధులు కేటాయించేందుకు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సుముఖత వ్యక్తం చేస్తున్నారని ఎంపీ రాయపాటి సాంబశివ రావు తెలిపారు. అదివారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు రాయపాటికి స్వామి వారి తీర్థ ప్రసాదలను అందజేశారు. ఈ సందర్బంగా ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర రాజధాని నగరంలో పలు భావనలు రోడ్ల నిర్మాణాలకు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ శంకుస్థాపన చేశారని అన్నారు. కేంద్రం నుంచి నిధులు తేవడంలో ఎంపీల ప్రాత్రముఖ్యమైందన్నారు. రాష్ట్రాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని రాయపాటి వెల్లడించారు. దేవదేవుడి ఆశీస్సులతో రాష్ట్రం ప్రగతి పదంలో దూసుకు వెళ్లాలని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications