సీఎం అభ్యర్ధిగా పాలబుగ్గల పసివాడు పప్పునాయుడి పేరు ప్రకటిస్తావా బాబూ? సాయిరెడ్డి సెటైర్లు

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా నిత్యం విరుచుకు పడుతున్న విజయసాయి రెడ్డి తాజాగా టిడిపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు. ఇక ఇదే సమయంలో నారా లోకేష్ ని టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి తండ్రి, కొడుకులు ఇద్దరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ యువ నాయకత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

టీడీపీలో యువ నాయకులు వీళ్ళేనా చంద్రబాబు

టీడీపీలో యువ నాయకులు వీళ్ళేనా చంద్రబాబు

టీడీపీలో 40 శాతం సీట్లు యువతకే అంటూ ఇప్పుడు కొత్త పాట పాడుతున్నారు చంద్రం అంటూ ఎద్దేవా చేసిన విజయసాయిరెడ్డి యువత అంటే నారా లోకేశ్, చింతకాయల విజయ్, గౌతు శిరీష, అదితి గజపతి, పరిటాల శ్రీరామ్ వంటి వారసులేనా బాబూ? అని ప్రశ్నించారు. వీరికేనా టిక్కెట్లు అని నిలదీశారు. ఇదే సమయంలో సీఎం అభ్యర్ధిగా పాలబుగ్గల పసివాడు పప్పు నాయుడి పేరు ప్రకటిస్తావా బాబూ? అంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు నువ్వో రియల్ ఎస్టేట్ బ్రోకర్ వి

చంద్రబాబు నువ్వో రియల్ ఎస్టేట్ బ్రోకర్ వి

టీడీపీ వార్షికోత్సవంలో చంద్రబాబుదంతా రియల్ ఎస్టేట్ ముచ్చట్లే అని పేర్కొన్న విజయసాయిరెడ్డి 94లో కోకాపేటలో ఎకరం 60 వేలు ఉందని, ఇప్పుడు 60 కోట్లు ఉందని చంద్రబాబు చెబుతున్నారని పేర్కొన్నారు. హైటెక్ సిటీలో అప్పుడంత. ఇప్పుడింత. అమరావతిలో రేట్లు అప్పుడు, ఇప్పుడు అంటూ చంద్రబాబు ఏకరవుపెట్టారు. బాబూ! నువ్వు లీడర్ వనే భ్రమలో ఒక వర్గం ఉంది. కానీ నువ్వో రియల్ ఎస్టేట్ బ్రోకర్‌వి అంటూ విజయ సాయి రెడ్డి టార్గెట్ చేశారు.

పప్పుకు చిప్ డ్యామేజ్ అయ్యింది

పప్పుకు చిప్ డ్యామేజ్ అయ్యింది

అదే సమయంలో పప్పుకు చిప్పు డ్యామేజి అయింది. ఏదో విమర్శ చేయబోయి తనే ఇరుక్కుంటాడు అంటూ లోకేష్ ను టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి యాక్సిడెంట్ల తీవ్రత, కారణాలను చూసి ఎక్స్ గ్రేషియా నిర్ణయిస్తారు అంటూ పేర్కొన్నారు. కేంద్రం 2 లక్షలు ప్రకటించింది. ఢిల్లీని ప్రశ్నించే ధైర్యం ఉందా? పుష్కరాల తొక్కిసలాట మృతుల ఉసురు తీసింది మీరే కదా. కంపెన్సేషన్ ఎంతిచ్చారు? అని ప్రశ్నించారు విజయ సాయి రెడ్డి.

చంద్రబాబు పాపాలు పరిహారమవుతాయా?

చంద్రబాబు పాపాలు పరిహారమవుతాయా?

అంతేకాదు వెన్నుపోటు కుట్రతో ఎన్టీఆర్స్థాపించిన టీడీపీ నుంచి ఆయననే బహిష్కరించి, పార్టీబ్యాంకు డిపాజిట్లు సహా ఆస్తులను కొట్టేశాడు చంద్రబాబు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. నాడు అదొక అనివార్య, చారిత్రక అవసరం అన్నట్టు 'బిల్డప్' ఇచ్చింది పచ్చ మీడియా అని పేర్కొన్నారు. నేడు ఆయన బొమ్మకు దండలేసి, దండాలు పెడితే పాపాలు పరిహారమవుతాయా? అంటూ విజయసాయిరెడ్డి చంద్రబాబును టార్గెట్ చేశారు.

కొత్త జిల్లాల ఏర్పాటుపైనా సాయిరెడ్డి పోస్ట్

కొత్త జిల్లాల ఏర్పాటుపైనా సాయిరెడ్డి పోస్ట్

సోషల్ మీడియా వేదికగా పెట్టిన మరో పోస్ట్ లో ప్రజల ఆకాంక్షలు, సీఎం జగన్ గారి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో కొత్త జిల్లాలు అవతరించబోతున్నాయి. ఇప్పుడున్న 13 జిల్లాలను పునర్ వ్యవస్థీకరిస్తూ 26 జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. ఏప్రిల్‌ 4 ఉదయం 9గం.05ని నుంచి 9గం.45ని. మధ్య కొత్త జిల్లాల అవతరణ జరగబోతోందని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+