పురందేశ్వరి సాక్షిగా వాంగ్మూలం ఇవ్వాలి - సాయిరెడ్డి..!!

ఏపీ రాజకీయాల్లో సాయిరెడ్డి వర్సస్ పురందేశ్వరి డైలాగ్ వార్ కొనసాగుతోంది. పురందేశ్వరి బీజేపీ అధ్యక్షురాలిగా కాకుండా టీడీపీ నేతగా వ్యవహరిస్తున్నారంటూ కొంత కాలంగా వైసీపీ ముఖ్య నేతలు ఆరోపణలు కొనసాగిస్తున్నారు. ఏపీలో మద్యం డిస్టలరీలు..అమ్మకాల విషయం పైన పురందేశ్వరి తీవ్ర ఆరోపణలు చేసారు. ఆ వ్యవహారంలో సాయిరెడ్డిని టార్గెట్ చేసారు. సాయిరెడ్డి దీనికి కౌంటర్ గా పురందేశ్వరి పైన పలు ఆరోపణలు సంధించారు. ఈ ఇద్దరి మధ్య సవాళ్ల పర్వం ఇంకా కొనసాగుతోంది.

సాయిరెడ్డి వర్సస్ పురందేశ్వరి : ఏపీలో డిస్టలరీలు..మద్యం అమ్మకాల పైన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పలు ఆరోపణలు చేసారు. ఇందులో వైసీపీ ఎంపీలకు ప్రమేయం ఉందని ఆరోపించారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయరెడ్డిని టార్గెట్ చేసారు. దీనికి స్పందనగా సాయిరెడ్డి సీరియస్ గా స్పందించారు. పురందేశ్వరి లక్ష్యంగా పలు ఆరోపణలు చేసారు. ఇదే సమయంలో బీజేపీ అధ్యక్షురాలిగా ఉంటూ బావ చంద్రబాబు కోసం పురందేశ్వరి రాజకీయంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సాయిరెడ్డి బెయిల్ వ్యవహారం పైన పురందేశ్వరి నేరుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసారు. బెయిల్ రద్దు చేయాలని కోరారు. ఇప్పుడు తాజాగా సాయిరెడ్డి మరో ట్వీట్ చేసారు.

MP Vijayasai Reddy suggestion for Purandeswari on Liquor Scam, which Chandra Babu involved as A-3.

సీఐడీకి ఆధారాలు ఇవ్వాలి : ఏపీ సీఐడీ ఏపీలో చంద్రబాబు హాయంలో చోటు చేసుకున్న లిక్కర్ స్కామ్ పైన కేసు నమోదు చేసింది. అందులో చంద్రబాబును ఏ-3గా పేర్కొంది. దీనికి సంబంధించి ఏసీబీ కోర్టులో సీఐడీ పిటీషన్ దాఖలు చేసింది. ఈ కేసుల ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు సాయిరెడ్డి తాజాగా చేసిన ట్వీట్ లో .. చంద్రబాబు గారు A-3గా కేసు నమోదైన లిక్కర్ స్కామ్ పై తన దగ్గర ఉన్నాయంటున్న ఆధారాలను పురంధేశ్వరి గారు దర్యాప్తు సంస్థ సీఐడీకి అందజేయాలి. ప్రజల దృష్టిని మళ్లించడానికి తప్పుడు సమాచారంతో మాపైన నిందలు వేయడం కాదు. వాస్తవాలు బయట పడాలంటే సాక్షిగా తన వాంగ్మూలం ఇచ్చి నిందితులకు శిక్ష పడేలా చేయాలి...అంటూ సూచించారు.

మారుతున్న సమీకరణాలు : ఇక, ఈ ఇద్దరు నేతల మధ్య సాగుతున్న పొలిటికల్ వార్ లో ఇది కొత్త మలుపుగా కనిపిస్తోంది. సాయిరెడ్డి చేసే ప్రతీ ట్వీట్ పైన స్పందించాల్సిన అవసరం లేదని గతంలోనే పురందేశ్వరి చెప్పుకొచ్చారు. లిక్కర్ వ్యవహారంలో పూర్తి ఆధారాలు సేకరించామని స్పష్టం చేసారు. దీంతో, ఇప్పుడు ఆ ఆధారాలను సీఐడీకి ఇవ్వాలని సాయిరెడ్డి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. దీని పైన బీజేపీ ముఖ్యులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఏపీలో పురందేశ్వరి వర్సస్ వైసీపీ గా కొనసాగున్న వార్ ఎన్నికల నాటికి ఎలాంటి టర్న్ తీసుకుటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+