పవన్ పై నారాయణ మరదలి వీడియో; మనసెలా వచ్చింది నారాయణ: ఎంపీ సాయిరెడ్డి!!
మాజీ మంత్రి నారాయణ వ్యవహారాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆడేసుకుంటున్నారు. మాజీ మంత్రి నారాయణ మరదలు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులతో నారాయణ వ్యవహారంపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి నారాయణ మరదలు సోషల్ మీడియాలో మరో వీడియో పెట్టి రచ్చ మొదలుపెట్టారు . ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ ని కూడా టార్గెట్ చేశారు.
తాను పవన్ కళ్యాణ్ అభిమానిని అని, తన పరిస్థితి ఇది అని చెబుతున్న పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని, తనకు ఇంత అన్యాయం జరిగితే పవన్ ఎందుకు నోరెత్తటం లేదని మాజీ మంత్రి నారాయణ మరదలు ప్రియ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యకపోతే మ కులం నుండే బహిష్కరిస్తానని అందరికీ చెప్పానని అంతటి అభిమానం తనకు పవన్ కళ్యాణ్ పై ఉందన్నారు.

పవన్ కళ్యాణ్ ని కూడా ఇప్పుడు అనుమానించవలసి వస్తుందని,జనసైనికులు క్షమించాలని కోరుతూనే ఆమె పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడిన వీడియోను పోస్ట్ చేసిన వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ఒకపక్క క్యాన్సర్ ప్రాణాలను తోడేస్తున్నా తనపై జరిగిన అకృత్యాలను ధైర్యంగా బయటపెట్టారు నారాయణ మరదలు అని తెలిపారు సాయి రెడ్డి.
మీ సోదరుడి భార్యకు మతిస్థిమితం లేదని అనడానికి మనసెలా వచ్చింది నారాయణా అంటూ ప్రశ్నించారు . గుండెలను పిండేసే వ్యథ కనిపిస్తోంది ఆమె మాటల్లో అంటూ ఎంపీ విజయ సాయి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తను 'నార్కోఅనాలిసిస్' పరీక్షకు సిద్ధమని ప్రకటించింది.
ఒకపక్క క్యాన్సర్ ప్రాణాలను తోడేస్తున్నా తనపై జరిగిన అకృత్యాలను ధైర్యంగా బయటపెట్టిన మీ సోదరుడి భార్యకు మతిస్థిమితం లేదని అనడానికి మనసెలా వచ్చింది నారాయణా. గుండెలను పిండేసే వ్యథ కనిపిస్తోంది ఆమె మాటల్లో. తను ‘నార్కోఅనాలిసిస్’ పరీక్షకు సిద్ధమని ప్రకటించింది. మీరు కూడా అందుకు రెడీ… pic.twitter.com/Vtv6sa8lL2
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 1, 2023
మీరు కూడా అందుకు రెడీ అయితే వాస్తవమేమిటో తేలిపోతుంది కదా! అంటూ నార్కో అనాలసిస్ పరీక్షకు రెడీ అవ్వాలని సూచించారు. నిజానిజాలు ఏమిటో తెలిస్తే ఎవరు ఏమిటో అర్ధం అవుతుందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. నార్కో పరీక్షకు వెళ్తే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications