• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అప్పుడు ఫోన్లో భ్రీఫ్‌డ్ .. ఇప్పుడు వాట్సప్ లో భ్రీఫ్‌డ్ ; కుట్రబాబు స్టైల్ మనీ పాలిటిక్స్ : సాయి రెడ్డి ఫైర్

|

వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలలో పార్లమెంటులో ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టులపై పోరాటం కొనసాగిస్తూనే, ట్విట్టర్ వేదికగా చంద్రబాబు నాయుడు, అశోక్ గజపతిరాజు ను టార్గెట్ చేసి సంచలన పోస్టులు పెడుతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై పార్లమెంట్ లో వైఎస్ఆర్ సీపీ పోరాటం కొనసాగిస్తూనే ఉందని పార్లమెంట్ వేదికగా అధికార పార్టీ ఎంపీల పోరాటాన్ని చెప్తూనే ఆయన టీడీపీ నేతలను వదిలిపెట్టకుండా విమర్శిస్తున్నారు.

పాతవన్నీ తిరగతోడుతూ .. అశోక్ గజపతి రాజు, చంద్రబాబుకు దిమ్మ తిరిగే షాకులిస్తున్న వైసీపీ ఎంపీ సాయిరెడ్డిపాతవన్నీ తిరగతోడుతూ .. అశోక్ గజపతి రాజు, చంద్రబాబుకు దిమ్మ తిరిగే షాకులిస్తున్న వైసీపీ ఎంపీ సాయిరెడ్డి

ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, దిశ చట్టం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై రాజ్యసభలో చర్చకు అనుమతించాలని 267 నిబంధన కింద నోటీసులు ఇచ్చామని విజయసాయిరెడ్డి తెలిపారు. అంతేకాదు పార్లమెంటులో ప్రత్యేక హోదా పోలవరం నినాదాలు మార్మోగుతున్నాయి అని పేర్కొన్న విజయసాయిరెడ్డి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం వైసీపీ ఎంపీలంతా పోరాటం చేస్తున్నారని స్పష్టం చేశారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ ఎదుట నిరసన కొనసాగిస్తున్నామని, వైసీపీ ఎంపీ లకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని తేల్చిచెప్పారు.

MP VijayMP ViMP VijayaSai reddy satires on chandrababu style money politicsjayaSai reddy satires on chandrababu style money politicsaSai reddy satires on chandrababu style money politics

అవసరం అనుకుంటే వెల్ లోకి అయినా వెళతామని, అనుకున్నది సాధించే వరకు పోరాడుతామన్నారు. పచ్చ మీడియా ముందు రెచ్చిపోయే పచ్చ నేతలు ఏమైపోయారు అంటూ టీడీపీ ఎంపీలను టార్గెట్ చేశారు. అంతేకాదు కోట్లతో ఓటు కొన్న కేసులో ఫోన్ లో బ్రీఫ్డ్ .. ఇప్పుడు వాట్సాప్ లో బ్రీఫ్డ్ .. స్టేట్ మారింది. ఫోను, క్లైంట్ మారారు, కానీ బ్రోకరిజం, బ్రీఫ్డ్ మాత్రం మారలేదు అంటూ పేర్కొన్న విజయసాయిరెడ్డి ఇదే కుట్ర బాబు స్టైల్ మనీ పాలిటిక్స్ అంటూ షాకింగ్ పోస్ట్ పెట్టారు. చంద్రబాబు ఒక ఛానల్ చైర్మన్ తో చేసిన వాట్సాప్ చాట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

  Andhra Pradesh : చంద్రబాబుపై సాయి రెడ్డి ఫైర్.. తెలుగు దళారీ పార్టీ బ్రోకర్లకు లోటే అంటూ..!!

  కేంద్ర మాజీ మంత్రి మాన్సస్ చైర్మన్ అశోక్ గజపతిరాజు తీరును ట్విట్టర్ వేదికగా ఎండగడుతున్న విజయసాయిరెడ్డి ఎన్టీఆర్ కు వెన్నుపోటు కుట్రలో అశోకే బాబుకు కుడిభుజం అయ్యాడని, ద్రోహమే జీవన విధానంగా మార్చుకున్నారని నిప్పులు చెరిగారు. 2017 కూనేరులో హీరాకుడ్ ఎక్స్ప్రెస్ ప్రమాద ఘటనను పదేపదే చెబుతున్న విజయ సాయి రెడ్డి అప్పుడు 42 మంది చని పోతే దాన్ని మావోయిస్టుల దుశ్చర్య అని ప్రకటించేలా రైల్వే సేఫ్టీ కమిషనర్ పై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. పదేపదే అశోక్ గజపతిరాజు, చంద్రబాబును టార్గెట్ చేస్తూ విజయ సాయి రెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నారు.

  English summary
  Rajya Sabha member Vijayasaireddy satires on chandrababu. Briefed on the phone in the case vote for money .. Now briefed on WhatsApp .. The state has changed. Vijayasaireddy said that the phone and the client have changed, but the brokerage and briefing have not changed. this is called Chandrababu style money politics. Moreover, Ashok Gajapathiraju was incensed that he was the right arm of Babu in the back stabbing of NTR.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X