పులివెందుల రిజల్ట్ పై ఎందుకీ కలరింగ్

కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ల జెడ్పీటీసీ ఉప ఎన్నికలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కడప లోక్ సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి స్పందించారు. దొంట ఓట్ల లెక్కింపుపై సిగ్గుమాలిన కథనాలను వెలువడుతున్నాయని మండిపడ్డారు. దొంగ ఓటింగ్ తో ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు కూడా రానివ్వకుండా ఈ ఎన్నికలను నిర్వహించిన విధానం మొత్తాన్నీ రాష్ట్ర ప్రజలు చూశారని చెప్పారు.

పులివెందులలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలీసులు, గుండాలతో దొంగ ఓటింగ్‌ నిర్వహించారని, ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ వారిని కనీసం పోలింగ్ కేంద్రాల వద్దకు రానివ్వకుండా ఈ ఎన్నికలను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్వహించిందని విమర్శించారు. వీటిని ఎన్నికలు అని ఎలా అంటారని ప్రశ్నించారు.

MP YS Avinash Reddy reaction on Pulivendula and Vontimitta ZPTC bypoll results

తమ అరాచకాలు, అమలు కాని సూపర్ సిక్స్ హామీలు, స్తంభించిపోయిన డెవలప్మెంట్ పై నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం అత్యంత కుట్రపూరితంగా ఈ ఎన్నికలను నిర్వహించిందని అవినాష్ రెడ్డి విమర్శించారు. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగాయని ప్రజలను మభ్యపెట్టేందుకే తమ అనుకూల మీడియా ద్వారా దిగజారుడు రాతలు రాయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎవరిని నమ్మించడానికి తెలుగుదేశం నాయకులు ప్రయత్నిస్తున్నారని అవినాష్ రెడ్డి ధ్వజమెత్తారు. అసలు ఓటింగ్ జరిగితేనే కదా ఉత్కంఠత అని రాయడానికి, జరిగిందే దొంగ ఓటింగ్. ఏకపక్షంగా ఎన్నిక ఫలితాలు ఉంటాయనేది పులివెందులలో ఓటు వేయలేని ప్రతి ఒక్క ఓటరుకూ తెలుసు. ఇది వాస్తవం.. అని ఆయన అన్నారు.

తాము దొంగ ఓట్లతో గెలుస్తున్నామనే విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకు, పులివెందుల ప్రాంతానికి చెందని రాష్ట్రంలోని ఇతర ప్రజలకు ఈ ఎన్నికల్లో ఓటు వేయడానికి రప్పించారని, ఓటర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓట్లు వేస్తున్నట్లుగా కలరింగ్ ఇచ్చేందుకే ఈ తప్పుడు రాతలు రాయించారని విమర్శించారు.

ప్రజాస్వామికంగా పులివెందుల, ఒంటిమిట్టలy పోలింగ్ జరిగినట్లు, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు, దానికి సంబంధించిన ఫలితాలు వెల్లడవుతున్నట్లుగా ఒక డ్రామాను సృష్టించారని టీడీపీ కూటమికి వైఎస్ అవినాష్ చురకలు అంటించారు. దొంగ ఓటింగ్ జరిగిందనేది చాలా స్పష్టంగా ఆధారాలతో సహా తాము బయటపెట్టామని గుర్తు చేశారు.

పోలీసుల సంపూర్ణ సహాయ సహకారాలతో, వేలాది మంది టీడీపీ కార్యకర్తలను పోలింగ్ కేంద్రాల వద్ద మోహరించి, ఓటర్లు కనీసం ఓటు కూడా వేయనివ్వకుండా బెదిరించి వెనక్కి పంపారని, తమ పార్టీ ఏజెంట్లను కూడా పోలింగ్ బూత్ లల్లోకి రానివ్వకుండా దౌర్జన్యం చేశారని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+