కూటమి vs వైసీపీ, పల్లె పోరులో కొత్త లెక్కలు - రేపే పోలింగ్.. కీలక పరిణామాలు..!!
ఏపీలో పల్లె పోరుకు రంగం సిద్దం అవుతోంది. పట్టణ పోరు ఫలితాల్లో కూటమి ఏకపక్షంగా గెలిచి పల్లె పోరుకు సిద్దమైంది. మున్సిపల్ ఎన్నికల్లో భారీగా నష్టపోయిన వైసీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు మరో పరీక్షగా మారుతున్నాయి. అటు కూటమి ఈ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని డిసైడ్ అయింది. దీంతో.. ఈ ఎన్నికలు రెండు వైపులా ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. పోలింగ్ వేళ కీలక సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. కూటమి ఏకపక్షంగా విజయం సాధించింది. వైసీపీ కేవలం ఒక కార్పోరేషన్.. నాలుగు మున్సిపాల్టీలే దక్కించుకుంది. కూటమి 90 శాతం స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో.. ఇక, ఇప్పుడు పల్లె పోరుకు రంగం సిద్దం అయింది. కూటమి- వైసీపీ కి ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారింది. పుర పోరులో ఊహించని ఫలితాలు ఎదుర్కొన్న వైసీపీకి ఈ ఎన్నికల్లో సత్తా చూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు కూటమి నేతలు మాత్రం తమకే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ మద్దతు దక్కుతుందని ధీమాగా ఉన్నారు. మున్సిపల్ తరహాలో నే ఈ ఎన్నికల్లోనూ ఫలితాలు సాధిస్తామని చెబుతున్నారు. అటు 28 జిల్లా పరిషత్ లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలోనూ చర్చలు జరుగుతున్నాయి. ఇటు పార్టీ నేతలతో జగన్ ఈ ఎన్నికల మీద కీలక దిశా నిర్దేశం చేసారు.

ఎన్నికల సంఘం ఏర్పాట్లు
రాష్ట్రవ్యాప్తంగా రేపు MPTC, ZPTC ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 659 ZPTC స్థానాలు, 9,829 MPTC స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో సుమారు 2.81 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కోనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల ఎంపికకు ఈ ఎన్నికలు కీలకం కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. పరిషత్ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 35,333 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నవంబర్ 7వ తేదీ శనివారం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. కాగా.. మున్సిపల్ ఎన్నికల్లో తక్కువగా పోలింగ్ నమోదు కావటంతో.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో జరిగే పోలింగ్ వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తుది ఫలితం పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.













Click it and Unblock the Notifications
