అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల ప్రభంజనం

అమెరికా మధ్యంతర ఎన్నికల ప్రారంభ ఫలితాల్లో డెమోక్రాటిక్ పార్టీ ఊహించని విజయాలతో దూసుకుపోతోంది. దేశవ్యాప్తంగా సాగుతున్న ఓట్ల లెక్కింపులో రిపబ్లికన్లు బలమైన పట్టు కలిగిన పలు కీలక రాష్ట్రాల్లోనూ డెమోక్రాట్లు ఘనవిజయాలను సొంతం చేసుకుంటోన్నారు. యూఎస్ కాంగ్రెస్‌లోని అప్పర్ హౌస్ సెనేట్‌తో పాటు దిగువ సభ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, వివిధ రాష్ట్రాల గవర్నర్, అసెంబ్లీ రేసుల్లో డెమోక్రాటిక్ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యతను కనబరుస్తోన్నారు. పట్టు బిగిస్తోన్నారు.

నార్త్ కరోలినా సెనేట్ స్థానంలో డెమోక్రాటిక్ అభ్యర్థి, మాజీ గవర్నర్ రాయ్ కూపర్ ఘనవిజయం సాధించే దిశగా పయనిస్తున్నారు. ఇక్కడ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత సన్నిహితుడు, రిపబ్లికన్ జాతీయ కమిటీ మాజీ అధ్యక్షుడు మైఖేల్ వాట్లేపై కూపర్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోన్నారు. ప్రస్తుత రిపబ్లికన్ సెనేటర్ థామ్ టిల్లిస్ సొంత పార్టీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో రిపబ్లికన్లు ఇక్కడ తీవ్రంగా నష్టపోయారు. 2008 తర్వాత నార్త్ కరోలినా నుంచి ఒక డెమోక్రాటిక్ నేత సెనేట్ స్థానాన్ని గెలుచుకోబోతోండటం ఇదే మొదటిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Democrats are projected to flip a Senate picking up significant victories in tight House and states

తీవ్ర ఉత్కంఠ రేపిన జార్జియా సెనేట్ స్థానంలో ప్రస్తుత డెమోక్రాటిక్ సెనేటర్ జాన్ ఓసాఫ్ తిరిగి విజయం సాధించారు. తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. సెనేట్‌పై పట్టు సాధించాలనే రిపబ్లికన్ల వ్యూహానికి ఇది ఎదురుదెబ్బగా మారింది. దీనికితోడు జార్జియా గవర్నర్ ఎన్నికల్లో డెమోక్రాట్ అభ్యర్థి కీషా లాన్స్ బాటమ్స్ చారిత్రాత్మక విజయం నమోదు చేశారు. 20 ఏళ్లకు పైగా రిపబ్లికన్ల వశంలో ఉన్న ఈ స్థానాన్ని గెలుచుకోవడమే కాకుండా, జార్జియాకు ఎన్నికైన మొదటి నల్లజాతీయురాలైన మహిళా గవర్నర్‌గా బాటమ్స్ చరిత్ర సృష్టించారు.

తుఫాన్ బలహీన పడింది గానీ..: ఏపీలో నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
తుఫాన్ బలహీన పడింది గానీ..: ఏపీలో నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

నియోజకవర్గాల రీమ్యాపింగ్ ద్వారా ప్రయోజనం పొందాలని చూసిన రిపబ్లికన్లకు పలు చోట్ల భంగపాటు ఎదురైంది. ఫ్లోరిడా హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ లో రిపబ్లికన్లకు ఉన్న మూడింట రెండొంతుల సూపర్‌ మెజారిటీని డెమోక్రాట్లు విజయవంతంగా బద్ధలు కొట్టగలుగుతున్నారు. దీనిపై డెమోక్రటిక్ లెజిస్లేటివ్ క్యాంపెయిన్ కమిటీ అధ్యక్షురాలు హీథర్ విలియమ్స్ స్పందించారు. ఫ్లోరిడాలో లభించిన ఈ విజయం చారిత్రాత్మకమైనదని అభివర్ణించారు.

ఏపీలో తుఫాన్ మిగిల్చిన నష్టం: కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ: అత్యవసరంగా
ఏపీలో తుఫాన్ మిగిల్చిన నష్టం: కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ: అత్యవసరంగా

డొనాల్డ్ ట్రంప్‌కు బలమైన మద్దతు ఉన్న ప్రాంతాల్లో సైతం డెమోక్రాటిక్ అభ్యర్థులు మెరుగైన ఫలితాలను సాధించడం విశేషం. కేంటకి కాంగ్రెస్ నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో ట్రంప్ 15 శాతానికి పైగా ఆధిక్యం సాధించగా, ఈ సారి అక్కడ డెమోక్రాట్ అభ్యర్థి జాక్ డెంబో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఫ్లోరిడాలోని 25వ డిస్ట్రిక్ట్‌లో రిపబ్లికన్లు తమకు అనుకూలంగా రిమ్యాపింగ్ చేసినప్పటికీ.. డెమోక్రటిక్ రెప్రజెంటేటివ్ జేర్డ్ మోస్కోవిచ్ విజయం సాధించారు. తన స్థానాన్ని కాపాడుకున్నారు.

ఈ ఎన్నికల ఫలితాల్లో భారతీయ మూలాలున్న అభ్యర్థులు విజయాలు సాధిస్తోన్నారు. ఫ్లోరిడా 22వ కాంగ్రెషనల్ సీటు నుంచి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన భారతీయ సంతతికి చెందిన పియా దండియా విజయం సాధించారు. 94 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి ఆమెకు 52.2 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి కేసీ అస్కర్ 47.8 శాతం ఓట్లు సాధించారు. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఏర్పడిన స్థానం ఇది. డిసిషన్ డెస్క్ హెచ్‌క్యూ సైతం ఆమె విజయాన్ని అధికారికంగా ప్రకటించింది.

ఓహియో గవర్నర్ స్థానానికి పోటీ పడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి వివేక్ రామస్వామికి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తి మద్దతు ప్రకటించారు. ప్రారంభంలో ఆయన తన ప్రత్యర్థి, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి అమీ యాక్టన్ కంటే వెనుకంజలో ఉన్నారు. లెక్కింపు సుమారు 29 శాతానికి చేరుకున్న సమయంలో అమీ యాక్టన్ 61 శాతానికి పైగా ఓట్లు సాధించగా, రామస్వామికి 35 శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి. ఇక్కడ ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది.

భారత సంతతికి చెందిన సరితా కొమ్మారెడ్డి వార్తల్లో నిలిచారు. న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవికి పోటీ పడుతున్న ఆమె.. డెమోక్రటిక్ పార్టీకి చెందిన లెటీషియా జేమ్స్ నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నారు. ఈ పోరు హోరాహోరీగా సాగుతోంది. తుది ఫలితాలు అధికారికంగా వెల్లడయ్యే వరకు ఈ ఎన్నికల ముగింపుపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తిగా పూర్తయిన తర్వాతే సరితా కొమ్మారెడ్డి విజయం సాధిస్తారా లేదా అన్నది స్పష్టమవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+