మా ఓట్లు కూడా మీరే వేసుకున్నారు- ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఏకపక్షం అయ్యాయి. రాష్ట్రంలో 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటలను సైతం కూల్చివేసింది.

ఈ ఫలితాలపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. ఈ ఎన్నికల నిర్వహణ, పోలింగ్ సరళి, ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి వ్యవహరించిన తీరును ఎండగట్టారు. ఇటువంటి ఎన్నికల నిర్వహణ అనేది దేశ ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టుగా అభివర్ణించారు.

APCC Chief YS Sharmila reaction on AP Local body election results says You cast the votes yourselves

ప్రతిపక్ష పార్టీల ఓట్లను కూడా టీడీపీ కూటమే వేసుకుందని, గెలుపు కూడా తమదేనని ప్రకటించుకుందని షర్మిల ఎద్దేవా చేశారు. అలాంటప్పుడు ఇక ప్రజలు, ప్రజాస్వామ్యంతో పనేంటని ప్రశ్నించారు. ఎన్నికల్లో పారదర్శకత అనేదానికి విలువేంటని, స్వేచ్ఛ, నిష్పక్షపాతం అనే పదాలకు అర్థం ఉండదని అన్నారు. మున్సిపల్ ఫలితాల్లో కూటమి పార్టీల విజయం ప్రజా తీర్పు కాదని ఆమె తేల్చి చెప్పారు. అధికార మదానికి, రాక్షస తత్వానికి తార్కాణంగా అభివర్ణించారు.

స్థానిక ఎన్నికల ఫలితాలపై జగన్ సెటైరికల్ ట్వీట్
స్థానిక ఎన్నికల ఫలితాలపై జగన్ సెటైరికల్ ట్వీట్

ఇది కూటమి పార్టీల నిజమైన జయభేరి కాదని, ప్రజల గొంతు నొక్కి, ప్రతిపక్షాలను అణచివేసి, సాధించిన బలవంతపు గెలుపుగా షర్మిల పేర్కొన్నారు. ఓటు అనేది రాజ్యాంగం ప్రజలకు కల్పించిన అత్యున్నత హక్కు అని, అలాంటి పవిత్రమైన హక్కును అధికార బలంతో కాలరాశారని షర్మిల మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ ను కూటమి సంఘంగా మార్చారని ధ్వజమెత్తారు. పోలీసు వ్యవస్థను గుప్పిట్లోకి తీసుకుని, ఈ దేశ ఎన్నికలకే సరికొత్త నిర్వచనం చెప్పారని చురకలు అంటించారు.

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల ప్రభంజనం
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల ప్రభంజనం

దేశం ముంగిట రాష్ట్రం పరువు తీసినందుకు కూటమి పార్టీలు సిగ్గుపడాలని షర్మిల వ్యాఖ్యానించారు. పోలింగ్ సమయంలో సామాన్య ప్రజలు బూత్ లకు రాకుండా రౌడీలు, గూండాలను పెట్టారని, బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడ్డారని, ప్రతిపక్ష అభ్యర్థులను తన్ని తరిమేశారని ఆమె గుర్తు చేశారు. ఎన్నికలు జరిగిన చోట దౌర్జన్యాలకు పాల్పడ్డారని, బ్యాలెట్ బాక్సులను తమ ఆధీనంలోకి తీసుకున్నారని విమర్శించారు. ఓటు వేయకుండా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, ఓటరు తీర్పును తిరగరాసే ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య మనుగడకే గొడ్డలిపెట్టు, వ్యవస్థల విధ్వంసానికి పరాకాష్ట అని పేర్కొన్నారు. దీన్ని రాష్ట్ర ప్రజలు గుర్తించాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+