బ్యాలెట్ లో నా పేరు ఉండుంటే ల్యాండ్ స్లైడ్ లో గెలిచేవాళ్లం: డొనాల్డ్ ట్రంప్

అమెరికా మధ్యంతర ఎన్నికల ప్రారంభ ఫలితాల్లో డెమోక్రాటిక్ పార్టీ ఊహించని విజయాలతో దూసుకుపోతోంది. దేశవ్యాప్తంగా సాగుతున్న ఓట్ల లెక్కింపులో రిపబ్లికన్లు బలమైన పట్టు కలిగిన పలు కీలక రాష్ట్రాల్లోనూ డెమోక్రాట్లు ఘనవిజయాలను సొంతం చేసుకుంటోన్నారు. యూఎస్ కాంగ్రెస్‌లోని అప్పర్ హౌస్ సెనేట్‌తో పాటు దిగువ సభ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, వివిధ రాష్ట్రాల గవర్నర్, అసెంబ్లీ రేసుల్లో డెమోక్రాటిక్ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యతను కనబరుస్తోన్నారు. పట్టు బిగిస్తోన్నారు.

నార్త్ కరోలినా సెనేట్ స్థానంలో డెమోక్రాటిక్ అభ్యర్థి, మాజీ గవర్నర్ రాయ్ కూపర్ ఘనవిజయం సాధించే దిశగా పయనిస్తున్నారు. ఇక్కడ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత సన్నిహితుడు, రిపబ్లికన్ జాతీయ కమిటీ మాజీ అధ్యక్షుడు మైఖేల్ వాట్లేపై కూపర్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోన్నారు. ప్రస్తుత రిపబ్లికన్ సెనేటర్ థామ్ టిల్లిస్ సొంత పార్టీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో రిపబ్లికన్లు ఇక్కడ తీవ్రంగా నష్టపోయారు. 2008 తర్వాత నార్త్ కరోలినా నుంచి ఒక డెమోక్రాటిక్ నేత సెనేట్ స్థానాన్ని గెలుచుకోబోతోండటం ఇదే మొదటిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

After US Midterm Rebuff Trump says I wasn t on the Ballot and if I was we would have won landslide

తీవ్ర ఉత్కంఠ రేపిన జార్జియా సెనేట్ స్థానంలో ప్రస్తుత డెమోక్రాటిక్ సెనేటర్ జాన్ ఓసాఫ్ తిరిగి విజయం సాధించారు. తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. సెనేట్‌పై పట్టు సాధించాలనే రిపబ్లికన్ల వ్యూహానికి ఇది ఎదురుదెబ్బగా మారింది. దీనికితోడు జార్జియా గవర్నర్ ఎన్నికల్లో డెమోక్రాట్ అభ్యర్థి కీషా లాన్స్ బాటమ్స్ చారిత్రాత్మక విజయం నమోదు చేశారు. 20 ఏళ్లకు పైగా రిపబ్లికన్ల వశంలో ఉన్న ఈ స్థానాన్ని గెలుచుకోవడమే కాకుండా, జార్జియాకు ఎన్నికైన మొదటి నల్లజాతీయురాలైన మహిళా గవర్నర్‌గా బాటమ్స్ చరిత్ర సృష్టించారు.

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల ప్రభంజనం
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల ప్రభంజనం

ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ ఘనవిజయం సాధిస్తుండటంతో రిపబ్లికన్ వర్గాల్లో అంతర్మథనం మొదలైంది. దీన్నిఎలా డిఫెండ్ చేసుకోవాలో తెలియని పరిస్థితిలో పడ్డారు. ఏ రకంగా చూసినా తమ రెండున్నరేళ్ల పాలనలో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందనడానికి ఇది అతిపెద్ద ఉదాహరణగా భావిస్తోన్నారు. 2028 నవంబర్ లో అధ్యక్ష ఎన్నికలను ఎదుర్కొనాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని అధిగమించడంపై దృష్టి సారించాల్సి ఉందని అభిప్రాయపడుతోంది. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ తమ ఆధిపత్యాన్ని కోల్పోయే దిశగా రిపబ్లికన్ పార్టీ పయనిస్తుండటం మింగుడుపడట్లేదు.

మా ఓట్లు కూడా మీరే వేసుకున్నారు- ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
మా ఓట్లు కూడా మీరే వేసుకున్నారు- ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు

ఈ పరాజయం బాధ్యతను తనపై వేసుకోకుండా ఉండటానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు ప్రారంభించారు. ఎన్నికల ఫలితాల సరళిపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఒకవేళ స్వయంగా ఈ ఎన్నికల బరిలో ఉండి ఉంటే రిపబ్లికన్ పార్టీ అపార మెజారిటీతో తిరుగులేని విజయం సాధించి ఉండేదని వ్యాఖ్యానించారు. ఎన్నికల బ్యాలెట్ లో తన పేరు లేదనే విషయాన్ని పరోక్షంగా గుర్తు చేశారు. తాను నేరుగా పోటీ చేసి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని పేర్కొన్నారు. రిపబ్లికన్ పార్టీ ల్యాండ్ స్లైడ్ విజయాన్ని అందుకుని ఉండేదని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+