ముద్రగడ ఎంట్రీతో కొత్త మలుపు - ఆ నేతలపై గురి..!!
ఏపీలో గోదావరి రాజకీయం ఆసక్తి పెంచుతోంది. ముద్రగడ వైసీపీలో చేరారు. టీడీపీ, జనసేన పొత్తుతో గోదావరిలో కాపు ఓటింగ్ పైన ఆశలు పెట్టుకున్నారు. మూడు పార్టీల కూటమితో 2014 ఎన్నికల్లో గెలివటంతో తిరిగి అదే రికార్డు రిపీట్ అవుతుందని ఆశిస్తున్నారు. అయితే, అనూహ్యంగా ముద్రగడ వైసీపీలో ఎంట్రీతో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. సీఎం జగన్ గోదావరి జిల్లాల్లో ఇతర పార్టీల చేరికల పైన ఫోకస్ చేసారు. ముద్రగడ పాత్ర రానున్న రోజుల్లో కీలకం కానుంది.
ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరటంత ఆయన భవిష్యత్ పాత్ర పైన చర్చ మొదలైంది. కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పోరాటం చేసారు. చంద్రబాబు హయాంలో తునిలో కాపు రిజర్వేషన్ల కోసం నిర్వహించిన సభ తరువాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొద్ది రోజల క్రితం వరకు ముద్రగడ జనసేనలో చేరుతారనే ప్రచారం సాగింది. అయితే, నాదెండ్ల మనోహర్ ఒత్తిడితోనే సాధ్యపడలేదనే ప్రచారం ఉంది. తాడేపల్లిగూడెం సభలో పవన్ కళ్యాణ్ కాపు నేతలైన ముద్రగడ పద్మనాభం, చేగోండి హరిరామజోగయ్యలను పరోక్షంగా కామెట్ చేయడంపై కాపుల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఇప్పుడు ముద్రగడ వైసీపీలో చేరటం తో గోదావరి జిల్లాలో పార్టీక కలిసి వస్తుందనే అంచనాలు ఉన్నాయి.

ఉభయ గోదావరి జిల్లాల్లో సంఖ్యాబలంగా కాపులు అధికంగా ఉన్నారు. పద్మనాభం చేరికతో పార్టీకి కాపుల మద్దతు అందుతుందని భావిస్తున్నారు. ముద్రగడ ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయటం లేదు. బేషరతుగానే వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తన కుమారుడితో సహా వైసీపీ కండువా కప్పుకున్నారు. ఎన్నికల్లో జగన్ ను గెలిపించేందుకు తాను ప్రచారం చేస్తానని ముద్రగడ ప్రకటించారు. గతంలో కాంగ్రెస్, టీడీపీలో ఎమ్మెల్యేగా.ఎంపీగా..మంత్రిగా పని చేసిన అనుభవం ముద్రగడకు ఉంది. కాకినాడ నుంచి ఎంపీగానూ గెలిచారు. దీంతో, ఇప్పుడు కాకినాడ పార్లమెంట్ తో పాటుగా పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ గెలుపు కోసం ముద్రగడ ప్రచారం చేసే అవకాశం కనిపిస్తోంది. కాపు వర్గం ఓట్ల పైన జనసేన గురి పెట్టిన వేళ..ఇప్పుడు ముద్రగడ వైసీపీకి ఆ వర్గం ఓట్లు మళ్లించటంలో ఏ మేర సక్సెస్ అవుతారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications