జగన్ ను మళ్లీ సీఎం చేసేందుకు వెళ్తున్నా! రూట్ మ్యాప్ రిలీజ్ చేసిన ముద్రగడ..!

ఏపీలో ఇన్నాళ్లూ ఏ పార్టీలో చేరాలన్న దానిపై క్లారిటీ లేక వైసీపీ, టీడీపీ, జనసేన నేతలతో వరుస చర్చలు జరిపిన కాపు నేత ముద్రగడ పద్మనాభం ఎట్టకేలకు అధికార పార్టీని ఎంచుకున్నారు. ఈ నెల 14న వైసీపీలో చేరాలని ముద్రగడ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రజలను ఉద్దేశించి ముద్రగడ మరో లేఖ విడుదల చేశారు. ఇందులో ఆయన వైసీపీలో చేరే రూట్ మ్యాప్, ఇతర వివరాలను విడుదల చేశారు.

mudragada padmanabham released open letter says going to join ysrcp on 14 released root map

ముద్రగడ పద్మనాభం ఇవాళ ప్రజలకు రాసిన లేఖలో.. ఈ మధ్య రాజకీయ పరిణామాలు మీకు మీడియా ద్వారా తెలుసు అనుకుంటున్నానన్నారు. సీఎం జగన్ పిలుపు మేరకు వైసీపీలో చేరాలని మీ ఆశీస్సులతో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జగన్ ను తిరిగి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టడానికి ఎలాంటి కోరికలు లేకుండా వారి విజయానికి మీ సహకారంతో పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.

జగన్ ద్వారా పేదవారికి సంక్షేమ పథకాలతో పాటు వీలైనంత అభివృద్ధిని వారితో చేయించాలని ఆశతో ఉన్నట్లు ముద్రగడ తెలిపారు. మీ బిడ్డ అయిన నేను ఎప్పుడూ తప్పు చేయలేదని, చేయను కూడా అని ముద్రగడ గుర్తుచేశారు. అలాగే మార్చి 14న వైసీపీలో చేరేందుకు తాను చేపట్టిన ర్యాలీకి వచ్చే వారు తమ ఆహారం తామే తెచ్చుకోవాలని సూచించారు. ఈ ర్యాలీ రూట్ మ్యాప్ కూడా వెల్లడించారు. ఇందులో తమ స్వగ్రామం కిర్లంపూడి నుంచి బయలుదేరి ప్రత్తిపాడు, జగ్గంపేట, లాలా చెరువు, వేమగిరి, రావులపాలెం, తణుకు, తాడేపల్లి గూడెం, ఏలూరు, విజయవాడ మీదుగా తాడేపల్లి చేరుకుంటానని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+