TTD: తిరుమలలో భక్తుల కోసం అంబానీ కీలక నిర్ణయం..!!
Tirumala: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కీలక నిర్ణయం ప్రకటించారు. తిరుమల శ్రీవారి ని దర్శించుకున్న అంబానీ టీటీడీ తో కలిసి కీలక ప్రకటన చేసారు. నిత్యం లక్షలాది మంది భక్తులకు అన్నప్రసాదం అందించే అన్నప్రసాద ట్రస్టుకు ఆధునిక వంటశాల నిర్మాణ బాధ్యత లు చేపట్టనున్నట్లు వెల్లడించారు. టీటీడీతో కలిసి ఈ నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. కాగా, గురువాయూర్ శ్రీ కృష్ణ దేవాలయానికి అంబానీ రూ 5 కోట్ల విరాళం ప్రకటించారు.
తిరుమల చేరుకున్న ముఖేష్ అంబానీ ఆదివారం ఉదయం స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొ న్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ముఖేశ్ అంబానీకి తిరుమల తిరుపతి దేవస్థానం అధి కారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండి తులు శాలువా కప్పి వేదాశీర్వచనం చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందిం చారు. కాగా, అంబానీ తిరుమల వేదికగా కీలక నిర్నయం తీసుకున్నారు. నిత్యం దాదాపుగా రెండు లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్న శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టు కోసం ఒక ఆధునీకమైన.. అత్యున్నత ప్రమాణాలతో కూడిన వంటశాల (కిచెన్) నిర్మించనున్నట్లు ప్రకటించారు . శ్రీవారి దివ్య ఆశీస్సులతో ఈ నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు.

ఈ పవిత్రమైన కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానములు (TTD) భాగస్వామ్యంతో పాటుగా మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంపూర్ణ సహకారంతో చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కొత్త వంట శాల అధునాతన ఆటోమేషన్‌ను కలిగి ఉంటుందని వివరించారు. ప్రతిరోజూ 2,00,000 (రెండు లక్షల) కంటే ఎక్కువ పవిత్ర భోజనాలను తయారుచేసి, అందించే సామర్థ్యాన్ని కలిగి ఉండేలా తీర్చి దిద్దుతున్నట్లు రిలయెన్స్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. తద్వారా, ప్రతి భక్తుడికి అత్యంత భక్తి, పరిశుభ్రత మరియు శ్రద్ధతో తయారుచేసిన పౌష్టికాహార అన్నప్రసాదం ప్రేమతో అందుతంద ని వివరించారు. టీటీడీ ఆలయాల్లో అన్నింటిలోనూ అన్న ప్రసాదాలు అందించాలనే నిర్ణయాన్ని స్వాగతించారు. ఇదే సమయంలో అంబానీ గురువాయూర్ శ్రీ కృష్ణ దేవాలయాన్ని సందర్శించి ఆ దేవాలయానికి రూ. 5 కోట్ల రూపాయలను విరాళంగా అందించారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications