రాయపాటి ఔట్: ఆ పదవితో మురళీమోహన్ చిరకాల కోరిక తీరినట్లే!

Subscribe to Oneindia Telugu

అమరావతి/తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కొత్త ఛైర్మన్ పదవి కోసం తెలుగుదేశం పార్టీలో ఆశావాహులు చాలా మందే ఉన్నారు. చదలవాడ కృష్ణమూర్తి పదవీ కాలం ముగియడంతో ఈ పదవి ఎవరిని వరిస్తుందనే ఉత్కంఠ టీడీపీ నేతల్లో నెలకొని ఉంది. అయితే, ప్రముఖ సినీనటుడు, టీడీపీ రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్‌కే ఈ పదవి దక్కే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

చిరకాల కోరిక

చిరకాల కోరిక

మురళీ మోహన్ కూడా టీటీడీ పదవిపై ఎప్పట్నుంచో ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ముందుగా చదలవాడ కృష్ణమూర్తికి మాట ఇవ్వడంతో అప్పుడు మురళీ మోహన్‌కు నిరాశే ఎదురైంది. తర్వాత చూద్దామని బాబు చెప్పడంతో మురళీ మోహన్ కూడా ఏమీ అనలేకపోయినట్లు తెలిసింది.

చంద్రబాబు సానుకూలమే

చంద్రబాబు సానుకూలమే

అయితే, ఇప్పుడు మాత్రం టీటీడీ ఛైర్మన్ పదవిని అలంకరించాలనే కృతనిశ్చయంతో మురళీ మోహన్ ఉన్నట్లు తెలిసింది. ఇందుకు చంద్రబాబునాయుడు కూడా సానుకూలంగానే స్పందించే అవకాశాలున్నాయి.

రాయపాటి ఔట్

రాయపాటి ఔట్

అయితే, గుంటూరుకు చెందిన టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు కూడా టీటీడీ ఛైర్మన్ పదవని దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం.
కాగా, ఇటీవల రాయపాటికి, చంద్రబాబుకు మధ్య దూరం పెరిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో రాయపాటి కంటే కూడా మురళీమోహన్‌కే టీటీడీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టేందుకు చంద్రబాబు మొగ్గుచూపే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మురళీ మోహన్ ఖరారు

మురళీ మోహన్ ఖరారు

ఇప్పటికే చంద్రబాబునాయుడు.. టీటీడీ ఛైర్మన్ పదవికి మురళీ మోహన్‌ను ఖరారు చేసినట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కాగా, ప్రముఖ సినీ దర్శకుడు రాఘవేంద్రరావు టీటీడీ సభ్యులుగా కొనసాగే అవకాశం ఉంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
If the reports from the Telugu Desam Party sources are to be believed, Rajahmundry MP Maganti Murali Mohan is most likely to be the next chairman of the prestigious Tirumala Tirupati Devasthanams (TTD) trust board.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి