చైనా సంస్థ పేరిట రికార్డ్: చంద్రబాబు పేరిట గిన్నిస్ రికార్డ్‌కు ప్రయత్నం
అమరావతి: నా ఇటుక - నా అమరావతి పేరిట గిన్నిస్ రికార్డు కోసం భారీ ఎత్తున ఇటుకలు కొనుగోలు చేయాలని ఏపీ జల వనరుల శాఖ నిర్ణయించింది. మంగళవారం ఉదయం 9గంటల నుంచి బుధవారం 9 గంటల లోపు రూ.1,35,25,000తో 13,52,500 ఇటుకల్ని ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
నా ఇటుక నా అమరావతి, ముఖ్యమంత్రి చంద్రబాబు పేరిట గిన్నిస్ రికార్డ్ నెలకొల్పే ప్రయత్నంలో భాగంగా.. విజయవాడ నగర టిడిపి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం తొమ్మిది గంటలలోగా అత్యధిక ఇటుకల కొనుగోలులో... ప్రజలను కూడా భాగస్వాములు చేయాలని నిర్ణయించింది.
ఇందులో అత్యధిక ప్రజలను భాగస్వాములను చేయాలని నిర్ణయించింది. రాజధాని నిర్మాణానికి మై బ్రిక్ మై అమరావతి వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ డొనేషన్లను స్వీకరించడం ద్వారా గిన్నిస్ రికార్డ్ స్థాపించనుంది.

ఇప్పటి వరకు చైనాలో ఓ స్వచ్చంధ సంస్థ 24 గంటల్లో 1,05,300 మందిని భాగస్వాములను చేసినట్లు గిన్నిస్ రికార్డ్ ఉంది. ఇప్పుడు చైనాలోని స్వచ్చంధ సంస్థ రికార్డును అధిగమించాలని ఏపీ భావిస్తోంది.
రెండు లక్షల మందికి తక్కువ కాకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరిట రికార్డ్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని తెలుస్తోంది. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, పే యు ద్వారా డొనేషన్ చెల్లించి భాగస్వాములు కావొచ్చునని చెబుతున్నారు.
ఇదిలా ఉండగా, ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వాములు అయ్యేందుకు నా ఇటుక నా అమరావతి వెబ్ సైట్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. దీనికి మంచి స్పందన లభిస్తోంది.












Click it and Unblock the Notifications