చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క్లీనర్ నిజం ఒప్పేసుకున్నాడు.. ఏర్పేడు ఘటనలో 'మిస్టరీ' ఇదే!

చివరగా తేలిందేంటంటే.. ప్రమాదం జరిగిన రోజు డ్రైవర్ గురవయ్య, క్లీనర్‌ సుబ్రహ్మణ్యం.. తలో కొద్దిసేపు లారీని మార్చి మార్చి నడిపారు. ఏర్పేడు చేరుకునే సమయానికి లారీని క్లీనర్

|
Google Oneindia TeluguNews

రేణిగుంట: మొత్తంగా ఊరినే వల్లకాడులా మార్చేసిన ఏర్పేడు ప్రమాద ఘటన వెనుక మిస్టరీ కొద్ది కొద్దిగా వీడుతోంది. ప్రమాద సమయంలో లారీ నడిపింది క్లీనరే అన్న అభిప్రాయాలు బలంగా వినబడుతున్న నేపథ్యంలో.. విచారణలోను అదే తేలింది.

ఏర్పేడు ప్రమాదంలో ట్విస్ట్: లారీని క్లీసర్ నడిపాడా? సీసీటీవి పుటేజీలో దృశ్యాలుఏర్పేడు ప్రమాదంలో ట్విస్ట్: లారీని క్లీసర్ నడిపాడా? సీసీటీవి పుటేజీలో దృశ్యాలు

విచారణ సందర్భంగా నిందితులు గందరగోళ సమాధానాలు చెప్పడంతో.. అసలు నిజం రాబట్టడానికి పోలీసులకు మరింత సమయం పట్టింది. చివరగా తేలిందేంటంటే.. ప్రమాదం జరిగిన రోజు డ్రైవర్ గురవయ్య, క్లీనర్‌ సుబ్రహ్మణ్యం.. తలో కొద్దిసేపు లారీని మార్చి మార్చి నడిపారు. ఏర్పేడు చేరుకునే సమయానికి లారీని క్లీనర్ సుబ్రహ్మణ్యం నడుపుతున్నాడు.

రేణిగుంటలో మద్యం సేవించి:

రేణిగుంటలో మద్యం సేవించి:

మాదానికి కారణమైన లారీ గురువారం రాత్రి మహబూబ్‌నగర్‌ నుంచి బయలుదేరి శుక్రవారం ఉదయం కడపకు చేరుకుంది. అక్కడి నుంచి రేణిగుంట వరకు డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ తలో కొద్దిసేపు లారీని నడిపారు. ఇంతలో రేణిగుంట చెక్ పోస్టు వద్దకు వచ్చాక.. ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. మాంసాహారంతో భోజనం చేశారు.

లారీ యజమానిని కలుద్దామని:

లారీ యజమానిని కలుద్దామని:

నిజానికి రేణిగుంట నుంచి వారు చెన్నైకి వెళ్లాల్సి ఉంది. పుత్తూరు మీదుగా అక్కడికి వెళ్లడం దగ్గరి దారి అయినప్పటికీ.. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో లారీ యజమానిని కలిసి అక్కడి నుంచి విశాఖపట్నం- చెన్నై మార్గంలో వెళ్లాలని అనుకున్నారు.

మద్యం ఎక్కువై:

మద్యం ఎక్కువై:

రేణిగుంటలో మద్యం సేవించి తిరిగి బయలుదేరే సమయంలో.. తొలుత డ్రైవర్ గురవయ్య లారీని నడపడానికి సిద్దపడ్డాడు. అయితే..'నీకు మత్తు ఎక్కువైంది, నేనే లారీ నడుపుతా, నువ్వు తప్పుకో' అంటూ క్లీనర్ సుబ్రహ్మణ్యం స్టీరింగ్ చేతపట్టుకున్నాడు. సుబ్రహ్మణ్యం డ్రైవింగ్ చేస్తుండటంతో డ్రైవర్ గురవయ్య వెనుక సీటులో నిద్రకు ఉపక్రమించాడు.

ఏర్పేడు వద్దకు రాగానే:

ఏర్పేడు వద్దకు రాగానే:

కాసేపటికి లారీ ఏర్పేడు వద్దకు రాగానే.. క్లీనర్ సుబ్రహ్మణ్యం పట్టు కోల్పోయాడు. మగతలో ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో రెండు ఆటోలు, పోలీసు జీపును ఢీకొన్నాడు. అదే సమయంలో పోలీసుస్టేషన్‌ ఎదుట ఉన్న ప్రజల మీదకు లారీని ఎక్కించాడు. ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు.

ఊహించలేదన్న క్లీనర్:

ఊహించలేదన్న క్లీనర్:

నియంత్రణ కోల్పోయి రోడ్డు కిందుగా లారీ వెళ్లడం.. లోతట్టు ఎక్కువగా ఉండటంతో తిరిగి హైవే పైకి లారీని ఎక్కించలేకపోయానని విచారణలో క్లీనర్ చెప్పాడు. అంతేకాదు, ప్రమాదం జరిగినప్పటికీ.. అది ఇంత భారీ స్థాయిలో జరిగి ఉంటుందని ఊహించలేకపోయినట్లు తెలిపాడు. ఘటన జరిగిన వెంటనే అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించినట్లు పేర్కొన్నాడు.

కాగా, డ్రైవర్‌ గురవయ్యకు లైట్‌ వెహికల్‌ లైసెన్స్‌ ఉండగా.. క్లీనర్‌ సుబ్రహ్మణ్యానికి అసలు లైసెన్సే లేకపోవడం గమనార్హం.

గందరగోళ సమాధానాలు:

గందరగోళ సమాధానాలు:

పోలీసులు అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా డొంక తిరుగుడు సమాధానాలు చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవింగ్ ఎవరు చేస్తున్నారు? అన్న ప్రశ్నకు.. ఇద్దరూ ఒక్కోలా జవాబు చెప్పారు. దీంతో పోలీసులు సందిగ్ధంలో పడ్డారు. చివరాఖరికి ఓ ఉన్నతాధికారి ఎదుట క్లీనర్ సుబ్రహ్మణ్యం నిజం అంగీకరించాడు. ఆ సమయంలో వాహనం నడిపింది తానే అని ఒప్పుకున్నాడు.

English summary
Atlast lorry cleaner was agreed the truth infront of police regarding Yerpedu accident. Police declared that lorry cleaner was drived the vehicle
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X