ఏ పార్టీలో చేరను, పుస్తకాలు రాస్తా: జగన్‌కి మాట నిలకడ లేదని మైసూరా
హైదరాబాద్: పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఎంవీ మైసూరారెడ్డి వైసీపీకి బుధవారం రాజీనామా చేశారు. తన నాలుగు పేజీల రాజీనామా లేఖను ఉదయం 10 గంటలకు ఈమెయిల్ ద్వారా పార్టీ అధ్యక్షుడు జగన్‌కు పంపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మైసూరా మాట్లాడుతూ ఇంకా ఏ పార్టీలో చేరాలనే విషయాన్ని ఆలోచించలేదని చెప్పారు.
పార్టీ నేతలపై తాను ఎటువంటి షరతులు పెట్టలేదని తెలిపారు. తాను ఏ పార్టీలో ఉన్నా నమ్మకంగానే పనిచేశానని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మైసూరా రెడ్డి జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు మానవీయత లేదని అన్నారు. టిఫిన్ కోసం రమ్మని తన మెడలో కండువా వేశారని అన్నారు.

ఆ సమయంలో నాకు ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వలేదని వాపోయారు. ఫోన్‌లో మాట్లాడడానికి కూడా జగన్ దొరకరని మైసూరా ఎద్దవా చేశారు. అధికార పీఠం పైనే ధ్యాస ఎక్కువని మండిపడ్డారు. జగన్ మాట మీద నిలబడే వ్యక్తి కాదని, మాట నిలకడ లేదని చెప్పారు. తాను చెప్పిన సలహాలను జగన్ ఆచరించడం లేదని చెప్పారు.
వైసీపీలో డబ్బు అనే అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని, వ్యక్తులకు ప్రాధాన్యత లేదని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతగా ప్రజాస్వామ్యంపై పోరాటం చేయలానే ధ్యాస జగన్‌కు లేదని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో తనకు ఓ అపవాదు ఉందని పార్టీలు మారుతుంటానని అయితే ఇప్పుడు మాత్రం ఏ పార్టీలో చేరనని పుస్తకాలు రాస్తానని అన్నారు.
జగన్ తీరు రేవు దాటక ముందు ఓట మల్లన్న, దాటిన తర్వాత బోడి మల్లన్న తీరు మాదిరి ఉంటుందని అన్నారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం దక్కలేదన్న భావనతో పార్టీకి రాజీనామా చేస్తున్నానే వార్తల్లో నిజం లేదన్నారు. పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చింది, పార్టీలో ఎదురైన ఇబ్బందులు, పార్టీ నిర్వహణలో లోపాలపై ఆయన లేఖలో స్పష్టం చేశారు.
వైసీపీకి రాజీనామా చేసిన మైసూరా కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు.












Click it and Unblock the Notifications