ఎన్ కన్వెన్షన్ ఇష్యూ: హీరో నాగార్జునకు నోటీసులు
హైదరాబాద్: సినీ హీరో అక్కినేని నాగార్జునకు అధికారులు నోటీసులు జారీ చేశారు. శేరిలింగంపల్లి తహసీల్దార్ విద్యాసాగర్ నాగార్జునకు ఎన్ కన్వెన్షన్ విషయంలో నోటీసులు జారీ చేశారు. హైదరాబాదులోని మాదాపూర్ తుమ్మిడికుంట చెరువును ఎన్ కన్వెన్షన్ నిర్మాణం కోసం ఆక్రమించారంటూ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే.
ఆ నేపథ్యంలోనే విద్యాసాగర్ నాగార్జునకు ఆ నోటీసులు జారీ చేశారు. గతంలో అధికారులు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు పూనుకోవడంతో యజమాని నాగార్జున తనకు ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా ఎలా కూలుస్తారంటూ కోర్టును ఆశ్రయించారు.

దీంతో ఈ నెల 26వ తేదీన మరో మారు తుమ్మిడికుంట చెరువును సర్వే చేయనున్నట్లు విద్యాసాగర్ తెలిపారు. సర్వే చేసి ఎన్ కన్వెన్షన్ సెంటర్ తుమ్మిడి కుంట చెరువు పూర్తి నీటిమట్టం బఫర్ జోన్లో నిర్మించారా, లేదా అనే విషయాన్ని నిర్ధారణ చేసుకుంటామని చెప్పారు.
నాగార్జునతో పాటు సంబంధిత భూములకు చెందిన ఇతరులకు కూడా నోటీసులు జారీ చేసినట్లు విద్యాసాగర్ తెలిపారు.
-
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications