ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్ కొరత వార్తలతో వినియోగదారుల్లో పలు ప్రాంతాల్లో ఆందోళన కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో వినియోగదారులు ఏజెన్సీల వద్దకు చేరుకొని గ్యాస్ రీఫిల్ కోసం వేచి చూస్తున్నారు. ఇటు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కోసం బంకుల వద్ద వాహనాలు బారులు తీరాయి. ప్రభుత్వం ఎలాంటి కొరత లేదని చెబుతున్నా... ఆందోళన కొనసాగుతోంది. వంట గ్యాస్ పెద్ద మొత్తంలో బుకింగ్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యం లో వంట గ్యాస్ సరఫరా పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది.
రాష్ట్రంలో వంట గ్యాస్ కొరత లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేసారు. ఈ రోజు జరిగిన మంత్రివర్గ భేటీలో పైప్డ్ నేచురల్ గ్యాస్ వినియోగంపై మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పట్టణాల్లో ప్రస్తుతం ఎల్ పీజీ గ్యాస్ వాడుతోన్న వినియోగదారులకు పైప్డ్ నాచులర్ గ్యాస్ అందించేలా చర్యలు చేపడతామని వివరించారు. దేశం లో తొలిసారిగా రాష్ట్రంలో ఎల్ పీజీ నుంచి పీఎన్ జీ కి మార్పిడి ని ప్రారంభి స్తున్నట్లు ప్రకటించారు. విజయవాడ ,గుంటూరు, తిరుపతి,నెల్లూరు, కాకినాడ, కర్నూలు నగరాల్లో వినియోగదారులకు పీఎన్ జీఅందుబాటులోకి తేవాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. అదే విధంగా పర్యావరణ హితమైన పైప్డ్ నేచరల్ గ్యాస్ ను ప్రజలు ఎక్కువగా వినియోగించేలా ప్రోత్స హించాలని కేబినెట్ నిర్ణయించింది. తిరుమల,విజయవాడ దుర్గగుడి , శ్రీకాళహస్తి,అన్నవరం, సింహాచలం దేవాలయ్యాల్లో పైప్డ్ నేచులర్ గ్యాస్ కనెక్షన్లు తీసుకోవాలని నిర్ణయించారు.

ఏపీ కేబినెట్ లో చర్చ.. నిర్ణయాలు
కాగా, అన్ని పట్టణాల్లో అన్నా క్యాంటీన్లలోనూ పీఎన్ జీ ఏర్పాటు చేయాలని క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నామని మనోహర్ వెల్లడించారు. ముందుగా పట్టణాల్లోని అపార్టుమెంట్లలో పైప్డ్ నేచురల్ గ్యాస్ సరఫరా కు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. గత వైసీపీ ప్రభత్వం పీఎన్ జీ పై జీఎస్టీని 5 నుంచి 25 శాతానికి పెంచిందని.. పట్టణాల్లో పీఎన్ జీ గ్యాస్ వినియోగదారులను పెంచేలా, ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. పట్టణాల్లో దీపం పథకంలోని గ్యాస్ కనెక్షన్లను పీఎన్ జీ గ్యాస్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. దీపం పథకం కింద ఇచ్చే రూ.2400 ఆర్ధిక సాయాన్ని పైఎన్ జీ గ్యాస్ కు మారిన వారికి ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది. పీఎన్ జీ కి మార్పిడి చేసుకున్న వారికి ఉచిత గ్యాస్ సరఫరా పథకం కింద 2 నెలలకు ఓ సారి లబ్దిదారులకు బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామని ప్రకటించారు. పట్టణ ప్రాంతాల్లోని 6 గ్యాస్ సరఫరా సంస్ధలు అదనపు పైప్ లైన్లు వేసేలా ప్రభుత్వం ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. 10 లక్షల ఎల్ పీ గ్యాస్ లను పీఎన్ జీ కనెక్షన్లకు మళ్లించాలని లక్ష్యంగా పెట్టుకోవాలని సీఎం ఆదేశించారని.. దీని ద్వారా ఆర్థికంగా 30 శాతం ఆదా అవుతుందని వివరించారు. పాఠశాలలకు సెలవులు ఇచ్చాక వారికిచ్చే గ్యాస్ ను వాణిజ్య అవసరాలకు మళ్లిస్తామని స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications