టిపై కిరణ్‌కు స్పీకర్ షాక్, జగన్ పార్టీకీ: ఓయులో ఉద్రిక్తం
హైదరాబాద్: సభాపతి నాదెండ్ల మనోహర్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి షాకిచ్చారు! సోమవారం ఉదయం సభ వాయిదా పడిన అనంతరం సభాపతి నాదెండ్ల మనోహర్ బిఏసి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బిఏసిలో మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చ ప్రారంభమైందా స్పష్టత ఇవ్వాలని కోరారు. దానికి స్పందించిన సభాపతి సభలో చర్చ ప్రారంభమైందని చెప్పారు.
అసెంబ్లీలో సమైక్యాంధ్రపై తీర్మానం చేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బిఏసిలో పట్టుబట్టింది. దానికి స్పందించిన ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.. తీర్మానం అవసరం లేదని, తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చ జరుగుతుందని తెలిపారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులను సభ నుండి సస్పెండ్ చేసి సభను నడపాలని తెలంగాణ రాష్ట్ర సమతి ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. కాగా, బిఏసి సమావేశం దాదాపు రెండు గంటలు సాగింది. అనంతరం మళ్లీ రెండు గంటలకు సమావేశం కావాలని నిర్ణయించారు. ముసాయిదా బిల్లు పైన చర్చ విషయంలో బిఏసిలో ఏకాభిప్రాయం కుదరలేదు.
తెరాస కక్ష్యలోకి రావాల్సిందే: జానా రెడ్డి
తెలంగాణ రాష్ట్ర సమితి ఎంత దూసుకెళ్లినా కక్ష్యలోకి రావాల్సిందేనని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి అన్నారు. తెంగాణ రాష్ట్రంలో కాంగ్రెసు పాలన కొనసాగుతుందన్నరాు. అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నందునే కృతజ్ఞతా సభలో నిర్వహించలేకపోతున్నామన్నారు.
ఓయులో ఉద్రిక్తత
అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లుపై వెంటనే చర్చ పూర్తి చేయాలని ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు అసెంబ్లీ ముట్టడికి బయలుదేరారు. వారిని పోలీసులు ఎన్‌సిసి గేటు వద్ద అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత తలెత్తింది. విద్యార్థులు పోలీసులపై రాళ్ల వర్షం కురుపించారు. పోలీసులు బాష్పవాయు ప్రయోగం చేశారు.












Click it and Unblock the Notifications