ఒక్క పవన్ కళ్యాణ్ కోసం ఒక్క స్ట్రోక్ లో కొన్నిలక్షల గుండెచప్పుళ్ళు: సభ సక్సెస్ పై నాగబాబు
8 వసంతాలు పూర్తి చేసుకుని తొమ్మిదవ వసంతంలోకి అడుగు పెట్టిన జనసేన పార్టీ వార్షికోత్సవ కార్యక్రమాన్ని జనసేన పార్టీ చాలా ఘనంగా నిర్వహించింది. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇప్పటం గ్రామంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభా వేదికపై జనసేన పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అధికార వైసీపీపై విరుచుకుపడ్డారు. 2024లో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. జనసేన పార్టీ అజెండాను కూడా సభా వేదికగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టిన నాగబాబు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సభ రాష్ట్ర రాజకీయాల దశ, దిశను మార్చే ప్రకటించడంతో జనసేన పార్టీ నిర్వహించిన సభకు లక్షలాదిగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. ఇప్పటం గ్రామం జనసంద్రంగా మారింది. జనసేన పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ సక్సెస్ కావడంతో పవన్ కళ్యాణ్ సోదరుడు, మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరికి తన కృతజ్ఞతలు తెలియజేశారు.

ఒక్కడి కోసం ఒక స్ట్రోక్ లో కొన్ని లక్షల గుండె చప్పుళ్ళు వినిపించాయన్న నాగబాబు
సభలో రాజకీయాలలో దొంగలు పడ్డారు అని వ్యాఖ్యలు చేసిన నాగబాబు వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చేస్తే అద్భుతమైన పాలన అందిస్తారని నాగబాబు వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ ప్రజల కోసం వచ్చిన ప్రజా నాయకుడని వ్యాఖ్యానించారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా సభపై ట్వీట్ చేశారు నాగబాబు . ఒక్కడి కోసం ఒక స్ట్రోక్ లో కొన్ని లక్షల గుండె చప్పుళ్ళు వినిపించాయని ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు.

మీ ప్రేమాభిమానాలే మేం ముందుకు నడిచేలా చేస్తున్నాయి
పవన్ కళ్యాణ్ పై మీరు చూపించిన ప్రేమ, మద్దతుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని సోషల్ మీడియా వేదికగా నాగబాబు వెల్లడించారు. మీ ప్రేమాభిమానాలే అవినీతి రహిత పాలన ఏర్పాటు లో భాగంగా మెరుగైన ,ధైర్యవంతమైన రేపటి సమాజం కోసం మేం ముందుకు నడిచేలా చేస్తున్నాయని నాగబాబు వ్యాఖ్యానించారు. ఒక్కడి కోసం, ఒక్క జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం ఒక స్ట్రోక్ లోనే కొన్ని లక్షల గుండెచప్పుళ్ళు వినపడడం చూస్తుంటే చాలా గొప్ప అనుభూతి కలుగుతుందని ఆయన ట్వీట్ చేశారు.
Recommended Video

జనసేన సభ సక్సెస్ కావటం తో కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్
ఇదిలా ఉంటే జనసేన సభ సక్సెస్ కావడంతో సభ సజావుగా సాగడానికి సహకరించిన పోలీస్ యంత్రాంగానికి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. సభ నిర్వహణలో క్రియాశీలకంగా వ్యవహరించిన జనసేన నాయకులను, శ్రేణులను పవన్ కళ్యాణ్ అభినందించారు.
సభను లైవ్ కవరేజ్ ఇచ్చిన మీడియా ప్రతినిధులు నీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పిన పవన్ కళ్యాణ్ బహిరంగ సభ నిర్వహించుకోవడానికి పొలాల నుంచి అండగా నిలిచిన ఇప్పటం గ్రామ రైతులకు, ప్రజలకు తన హృదయ పూర్వక కృతజ్ఞతలు అని వెల్లడించారు. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలిపే విధంగా రైతులు, ప్రజలు తమకు అండగా ఉన్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications