అన్న కోసం పవన్ త్యాగం - నాగబాబు శాఖలు ఖరారు..!!

మెగా బ్రదర్ నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్దం అవుతోంది. రాజ్యసభ ఛాన్స్ దక్కకపోవటంతో నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఈ నిర్ణయం పైన కూటమిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఇక..నాగబాబు శాఖల ఖరారు పై న చంద్రబాబు - పవన్ చర్చించారు. శాఖలను ఫిక్స్ చేసినట్లు సమాచారం. అదే విధంగా కూటమి పార్టీల నేతల నామినేటెడ్ పదవుల జాబితాను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

చంద్రబాబు - పవన్ భేటీలో
ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేక భేటీ కీలకంగా మారుతోంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నారు. ఇప్పటికే ఏపీ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యు లన ఎంపిక చేసిన సమయంలో చివరి నిమిషం వరకు రేసులో ఉన్న నాగబాబుకు సీటు దక్కక పోవటంతో మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఇప్పుడు భేటీలో మెగా బ్రదర్ మంత్రివర్గంలోకి ఎంట్రీ ముహూర్తం.. ప్రమాణ స్వీకారం పైన నిర్ణయం తీసుకోనున్నారు. అదే సమయంలో నాగబాబుకు ఆరు నెలల్లోగా ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది.

Nagababu port folios to finalised in Chandra Babu - Pawan Meeting and also nominated posts

నాగబాబుకు దక్కే శాఖలు
ప్రస్తుతం శాసన మండలిలో వైసీపీ సభ్యులు పలువురు రాజీనామా చేసారు. కానీ, ఛైర్మన్ వాటిని ఇంకా ఆమోదించ లేదు. నాగబాబుకు మంత్రి పదవి ఖరారు వేళ కూటమిలో వచ్చిన స్పందన తో ఇప్పుడు చంద్రబాబు - పవన్ నామినేటెడ్ పదవులను ఖరారు చేయాలని నిర్ణయించారు. అందు లో భాగంగా పిఠాపురం వర్మకు సైతం ఎమ్మెల్సీ ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక.. మంత్రి గా నాగబాబుకు ఇచ్చే శాఖల పైన తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం మంత్రి కందుల దుర్గేశ్ నిర్వహిస్తున్న టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖలు నాగబాబుకు కేటాయించే అవకాశాలు ఉన్నట్లు పార్టీ ముఖ్యుల సమాచారం.

పవన్ శాఖల కుదిస్తారా
తన అన్నకు దుర్గేశ్ కు శాఖలు బదలాయిస్తుండటంతో... తన వద్ద ఉన్న గ్రామీణాభివృద్ధి శాఖ లేదా అటవీ పర్యావరణ శాఖల్లో ఒకటి వదులుకోవటానికి పవన్ సిద్దమైనట్లు సమాచారం. పవన్ నుంచి ఆ శాఖను దుర్గేష్ కు కేటాయించనున్నారు. తొలుత నాగబాబుకు ఎక్సైజ్ లేదా గనుల శాఖ ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది. కానీ, ఆ రెండు శాఖలు బీసీ వర్గానికి చెందిన కొల్లు రవీంద్ర వద్ద ఉండటంతో..ఆయన వద్ద నుంచి నాగబాబుకు కేటాయిస్తే విమర్శలు వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయంతో ఈ ప్రతిపాదన విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు చంద్రబాబు - పవన్ చర్చల్లో నాగబాబు ప్రమాణ స్వీకారం .. మెగా బ్రదర్ కు శాఖలు .. నామినేటెడ్ పోస్టుల భర్తీ లిస్టు పైన తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+