అడ్డుకుంటే ఆగదు: నాగం, 2 విధాలేంటి: దేవినేని ప్రశ్న

అనంతరం మీడియా పాయింటు వద్ద నాగం మాట్లాడారు. సభను అడ్డుకొని సీమాంధ్ర ప్రజలకు ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు ద్రోహం చేస్తున్నారన్నారు. అవసరమైతే సీమాంధ్ర సమస్యలపై తాము చర్చించి పరిష్కార మార్గాలను చూపుతామన్నారు. పోలవరం పూర్తి, ముంపు సమస్యపై చర్చించాల్సి ఉందన్నారు. సమస్యలపై చర్చ జరగకుండా అడ్డుకోవడం సరికాదన్నారు. 25 ఎళ్లలో ఇలాంటి దౌర్జన్యకర ఘటనలు ఎప్పుడు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ముసాయిదా బిల్లు పైన తాము రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని సీమాంధ్ర టిడిపి ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. ఏ ఆధారంతో అసెంబ్లీలో చర్చకు పట్టుబడుతున్నారో చెప్పాలన్నారు. బిల్లు రెండు విధాలుగా ఉండటం సరికాదని, దీనిపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు. బిల్లు ఆంగ్లంలో ఓ రకంగా, తెలుగులో మరో రకంగా ఉందన్నారు. సభాపతి, ముఖ్యమంత్రికి అనుకూలంగా తర్జుమా చేసి సభను తప్పుదోవ పట్టిస్తుననారని ఆరోపించారు.
మండలిలోను..
తెలంగాణ ముసాయిదా బిల్లు పైన మండలిలోను గందరగోళం చెలరేగింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన మండలి సభ్యులు మండలిలో సమైక్యాంధ్ర ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు.












Click it and Unblock the Notifications