మరో 5 ఏళ్ళు లిఖితతో తప్పించుకోవాలనుకొన్నాడు, ఎటిఎం పట్టించింది

Posted By:
Subscribe to Oneindia Telugu

గుంటూరు: గుంటూరు జిల్లా భట్టిప్రోలు బాలిక కేసులో పోలీసులకు చుక్కలు చూపించాడు మాజీ ఆర్మీ ఉద్యోగి నాగేశ్వర్ రావు. పిల్లలు, మనుమళ్ళు, మనుమరాళ్ళు ఉన్నా కానీ మైనర్ బాలికలను ట్రాప్ చేయడమే నాగరాజు దిట్ట. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ఆయన జాగ్రత్తలు పడ్డారు. 46 రోజుల పాటు పగలు, రాత్రి అనే తేడా లేకుండా పోలీసులు వేట సాగించారు. సుమారు 13.50 లక్షలను ఖర్చుచేశారు. లిఖితనే కాదు మరికొందరిని కూడ నాగేశ్వర్ రావు ను ట్రాప్ చేసేందుకు ప్రయత్నించారని పోలీసులు చెప్పారు.

గుంటూరు జిల్లా భట్టిప్రోలుకు చెందిన లిఖిత అనే 13 ఏళ్ళ బాలికను 45 రోజుల క్రితం నాగేశ్వర్ రావు అనే ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేశాడు. జమ్మూ కాశ్మీర్ లోని సాంబా సెక్టార్ లో ఉన్న నాగేశ్వర్ రావు, లిఖితను పోలీసులు తీసుకొచ్చారు. నాగేశ్వర్ రావును విచారిస్తే ఆయన మరో నలుగురు బాలికలను ట్రాప్ చేసేందుకు ప్రయత్నించినట్టు పోలీసులు తెలిపారు.

లిఖిత తల్లిదండ్రులు కిడ్నాప్ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు సకాలంలో స్పందిస్తే 46 రోజులపాటు ఆ బాలిక ఆచూకీకోసం శ్రమపడాల్సిన అవసరం ఉండేది కాదని ఏపీ డీజీపి సాంబశివరావు వ్యాఖ్యానించారు.

అంతేకాదు సోషల్ మీడియా విషయంలో పిల్లల కదలికలపై ఓ కన్నేసి ఉంచాలని డీజీపీ తల్లిదండ్రులకు సూచించారు.ఇక నాగేశ్వర్ రావు పట్టుకోలేమనే పరిస్థితిలో టెక్నాలజీ ఆధారంగా అతడి ఆచూకీని తెలుసుకొన్నట్టు సాంబశివరావు చెప్పాడు. నాగరాజు అరెస్టుకు సంబంధించిన ఆయన మీడియాతో మాట్లాడారు.

నాగరాజు మహముదురు

నాగరాజు మహముదురు

ఆటో డ్రైవర్ నాగరాజు మహముదురని పోలీసులు తేల్చారు. గతంలో ఆయన బిఎస్ఎప్ లో పనిచేశాడు. అయితే అతడి ప్రవర్తన కారణంగా ఉద్యోగం పోగోట్టుకొన్నాడు. ప్రస్తుతం ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. చాక్లెట్లు, మిఠాయిలను మైనర్ బాలికలకు ఎరవేసి వారిని వశపరుచుకొంటాడు. 45 ఏళ్ళు దాటినా మైనర్ బాలికలంటేనే
ఆయన ఇష్టపడతాడని పోలీసులు చెప్పారు. భట్టిప్రోలుకు చెందిన లిఖితను కిడ్నాప్ చేసి ఆంధ్రప్రదేశ్ పోలీసులకు, తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేశాడు, నాగరాజు. అన్ని రకాలుగా విచారణ జరిపితే చివరకు నాగరాజు ఆచూకీని తెలుసుకొన్నట్టు చెప్పారు ఏపీ డీజీపి సాంబశివరావు.

నలుగురు బాలికలను ట్రాప్ చేసేందుకు ప్రయత్నించాడు

నలుగురు బాలికలను ట్రాప్ చేసేందుకు ప్రయత్నించాడు

లిఖిత కంటే ముందుగానే మరో నలుగురు బాలికలను ట్రాప్ చేసేందుకు నాగరాజు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. బాలికల తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులను తెలుసుకొని వారికి బహుమతులను ఇస్తుంటాడు. చాక్లెట్లు, బిస్కట్లను ఇస్తూ వారిని ట్రాప్ చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు.బాలికలకు దగ్గరయ్యేందుకు ప్రతి అవకాశాన్ని ఆయన ఉపయోగించుకొంటాడు. స్కూల్ కు వచ్చిన భట్టిప్రోలు కు చెందిన లిఖితను తన ఆటోలో ఎక్కించుకొని తీసుకెళ్ళాడు నాగరాజు.లిఖిత కంటే ముందుగా నలుగురు బాలికలను ట్రాప్ చేసేందుకు ప్రయత్నించాడు నాగరాజు. అయితే ఆ బాలికలు నాగరాజు వ్యవహరశైలిపై తల్లిదండ్రులకు ఫిర్యాదుచేశారు. దీంతో వారు నాగరాజు ఆటోను మాన్పించేశారు. చివరకు లిఖిత అతడి వలలో పడింది.

ఐదేళ్ళ వరకు దొరక్కకుండా ఉండేందుకు ప్లాన్

ఐదేళ్ళ వరకు దొరక్కకుండా ఉండేందుకు ప్లాన్

లిఖితను కిడ్నాప్ చేసిన సమయంలోనే ఐదేళ్ళవరకు తన ఆచూకీని దొరకకుండా నాగరాజు ప్లాన్ చేశాడు. లిఖిత వయస్సు ప్రస్తుతం 13 ఏళ్ళు. మరో ఐదేళ్ళు ఆగితే ఆమె మేజర్ అవుతోంది. అయితే అప్పటివరకు ఎవరి కంటపడకుండా ఉండాలని ప్లాన్ చేసుకొన్నాడు. కానీ, చివరకు 46 రోజుల తర్వాత పోలీసులకు చిక్కాడు.ఆమె మేజర్ అయితే తనను ఎవరూ ఏమీ చేయలేరనే ప్లాన్ చేశాడు. బాలికకు కుటుంబసభ్యులపై వ్యతిరేకతను పెంచాడు. నాగరాజు మత్తులో ఆ బాలిక పడిపోయిందని పోలీసులే విస్మయానికి గురయ్యారు.

 జాగ్రత్తలు

జాగ్రత్తలు

పేరు మార్చుకొని ఫ్యాక్టరీలో కార్మికుడిగా నాగరాజు పనిచేశాడు. పోలీసులు తన ఆచూకీ లభించకుండా చాలా జాగ్రత్తలు తీసుకొన్నాడు. సెల్ ఫోన్ వాడలేదు. బ్యాంకు ఖాతాను కూడ వాడలేదు. నాగరాజు స్నేహితులు, కుటుంబసభ్యులు ఇతరులపై నిఘావేసిన ఫలితం లేకుండా పోయిందని పోలీసులు చెప్పారు. అన్ని రాష్ట్రాల అధికారులతో పోలీసులు మాట్లాడారు. నాగరాజుతో పాటు లిఖిత ఫోటోను కూడ పంపారు. నాగరాజు గతంలో పనిచేసిన ఆర్మీ అధికారులతో మాట్లాడారు.అయితే అతడు కాశ్మీర్ లో ఎటిఎం ద్వారా డబ్బులను డ్రా చేశారు. అయితే దీని ఆధారంగా ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఓ ఫ్యాక్టరీలో ఇద్దరు కొత్తగా పనిలోకి చేరారని సమాచారంతో స్థానిక ఆర్మీ అధికారుల సహకారంతో పోలీసులు అరెస్టు చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ap Dgp Sambasiva rao told to media how to arrest Nagaraju in Jammu and Kashmir . Nagaraju trying to trap four minor girls he said. but they escaped. Likitha trapped by him.
Please Wait while comments are loading...