అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనం.. నమూనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు
రాజధాని అమరావతిలో 58 అడుగుల ఎత్తులో నిర్మించనున్న అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహ నమూనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. బుధవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన ఈ నమూనాలను సీఎం పరిశీలించారు. రాజధాని ప్రాంతంలోని శాఖమూరులో 6.8 ఎకరాల్లో ప్రభుత్వం పొట్టిశ్రీరాములు స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ స్మృతి వనానికి గత నెల 3వ తేదీన మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.
తెలుగు ప్రజల కోసం ప్రాణాలను త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జ్ఞాపకార్థం అమరావతిలో కూటమి ప్రభుత్వం స్మృతి వనం ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. ఈ స్మృతి వనానికి గత నెల 3వ తేదీన మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. తుళ్లూరు-పెదపరిమి మధ్య కేటాయించిన 6.8 ఎకరాల స్థలంలో స్మృతి వనం నిర్మించనున్నారు. అయితే పొట్టిశ్రీరాములు విగ్రహ నమూనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా పరిశీలించారు. బుధవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన ఈ నమూనాలను సీఎం పరిశీలించారు.
వచ్చే ఏడాది మార్చి 16న పొట్టి శ్రీరాములు 125వ జయంతి నాటికి ఈ స్మృతి వనంలో 58 అడుగుల విగ్రహాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో విగ్రహ డిజైన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ గా నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండీ రాకేష్, తదితరులు పాల్గొన్నారు.

ఇక ఈ స్మృతి వనంలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహంతో పాటు ఆడిటోరియం, మ్యూజియం, మినీ థియేటర్ నిర్మించనున్నారు. మొత్తం 6.8 ఎకరాల స్థలంలో నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ గతనెలలో శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం పొట్టిశ్రీరాములు 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసినందుకు గుర్తుగా 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని గతంలో నారా లోకేష్ వివరించారు. తన పాదయాత్ర సమయంలో ఆర్య వైశ్య సోదరులకు ఇచ్చిన హామీ మేరకు ఈ స్మృతి వనం నిర్మాణానికి ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications