వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గంజాయి రచ్చ: డీజీపీ .. విజయసాయికి నోటీసులిచ్చే దమ్ముందా? పవన్ కళ్యాణ్ కు నోటీసులు ఇస్తారా? టీడీపీ నేత ప్రశ్న !

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ పై మొదలైన దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. తెలుగుదేశం పార్టీ నేతలు ఏపీలో డ్రగ్స్ దందా జోరుగా సాగుతుందని, ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి దీని వెనుక ఉన్నారని చేసిన విమర్శలపై తెలుగుదేశం పార్టీ నేతలకు ఆధారాలు చూపించాలని పోలీసులు నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక దీంతో తాజాగా విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం డీజీపీ ని టార్గెట్ చేస్తూ టిడిపి నేతలు మండిపడుతున్నారు.

లోకేష్ పై గంజాయి ఆరోపణలు చేసిన సాయిరెడ్డికి నోటీసులు ఇస్తారా ?
తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఏపీలో డ్రగ్స్ వెనుక చంద్రబాబు, నారా లోకేష్ ఉన్నారని సంచలన ఆరోపణలు చేస్తున్నారని, మరి వీటికి ఆధారాలు ఇవ్వాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ విజయసాయి రెడ్డి కి నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో గంజాయి సాగు, రవాణాపై మాట్లాడానని తనకు నోటీసులు ఇచ్చారని పేర్కొన్న టిడిపి నేత నక్కా ఆనందబాబు అర్ధరాత్రి తన ఇంటికి పోలీసులను పంపి ఆధారాలు ఇవ్వాలని నానా హంగామా చేశారని మండిపడ్డారు. ప్రస్తుతం పోలీసులు గంజాయి సాగుతో లోకేష్ కు సంబంధం ఉందని విజయ సాయి చేసిన వ్యాఖ్యల్లో నిజం ఎంతో తేలాల్సి ఉందని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత నక్కా ఆనంద్ బాబు పేర్కొన్నారు.

Nakka anand babu attack on ap DGP to give notices to vijayasai reddy and pawan kalyan over ganja comments

పవన్ కళ్యాణ్ మాట్లాడాడు కదా.. ఆయనకు నోటీసులిస్తారా?
అంతేకాదు ఏపీ డ్రగ్స్ కు కేంద్రంగా మారిందని పవన్ కళ్యాణ్ చెప్పారని పేర్కొన్నారు నక్క ఆనంద్ బాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాదకద్రవ్యాల హబ్ అన్న పవన్ కళ్యాణ్ కు పోలీసులు నోటీసు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ కు నోటీసులు ఇచ్చే ధైర్యం పోలీసులకు ఉందా అంటూ ప్రశ్నించారు. దళిత నేతను కాబట్టే తన ఇంటికి అర్థరాత్రి వచ్చి హంగామా చేశారంటూ నక్క ఆనంద్ బాబు పేర్కొన్నారు . వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడినా నోటీసులు ఇవ్వని పోలీసులు, ఆధారాలను ప్రశ్నించని పోలీసులు, తన వంటి వారిపై అర్ధరాత్రి వచ్చి ఇబ్బందులకు గురి చేయడం ఏమిటని నక్క ఆనంద్ బాబు నిలదీశారు.

దళిత నేత కావటం వల్లే తనను ఇబ్బంది పెట్టారన్న నక్కా ఆనంద్ బాబు
ఏ టూ విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చే దమ్ముందా డిజిపి అంటూ నక్క ఆనంద్ బాబు ప్రశ్నించారు. మీరు అమలు చేస్తోంది ఏ రాజ్యాంగం అంటూ నిలదీశారు. ప్రస్తుతం రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాల పై మాట్లాడిన నక్క ఆనంద్ బాబు భవిష్యత్తులో దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. దళిత నేత కావడం వల్లే తనకు నోటీసులిచ్చి వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా గంజాయి మూలాలు విశాఖపట్నం ఏజెన్సీ కేంద్రం గా ఉన్నాయని గతంలో నల్గొండ ఎస్ పి మాట్లాడారని, హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారని నక్క ఆనంద్ బాబు పేర్కొన్నారు.

ఏపీ గంజాయి మూలాలపై దేశం కోడై కూస్తుంది ..
అంతేకాదు తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, దేశ రాజధాని ఢిల్లీ ఇలా అనేక రాష్ట్రాలలో దొరికిన గంజాయి ఏపీ నుండి రవాణా అయిందని ఆయా రాష్ట్రాల అధికారులు ప్రెస్ మీట్ లు పెట్టి మరీ చెబుతున్నారని, ఈ వారం రోజుల్లో రాష్ట్రంలో నాలుగు చోట్ల గంజాయి పట్టుబడిందని, గంజాయి కేసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదయ్యాయని నక్క ఆనంద్ బాబు విమర్శించారు.ఇక ఇదే విషయాన్ని తాను మాట్లాడితే ఆధారాలు కావాలని పోలీసులు అడగడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

తెలంగాణా పోలీసులకు డీజీపీ నోటీసులిస్తారా ?
ఏపీ నుంచి గంజాయి వస్తుందని తెలంగాణ పోలీసులు చెబుతుంటే మరి వారికి ఈ డీజీపీ నోటీసు ఇస్తారా అంటూ ప్రశ్నించారు నక్క ఆనంద్ బాబు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి గంజాయి వచ్చింది అంటూ మాట్లాడుతున్న చెప్పిన ప్రతి ఒక్కరికి ఏపీ పోలీసులు నోటిసులు ఇవ్వాల్సిందే అంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అందరికంటే ముందుగా ఢిల్లీ కేంద్రంగా సంచలన ఆరోపణలు చేసిన వైసీపీ పార్లమెంటరీ సభ్యుడు రెడ్డికి తక్షణమే నర్సీపట్నం సిఐ, విశాఖ డీఐజీ నోటీసు ఇవ్వాలని నక్కా ఆనందబాబు పేర్కొన్నారు.

English summary
YSRCP MP Vijayasai Reddy has made drugs dallegations on Chandrababu and Nara Lokesh and demanded that DGP to give notices to Vijayasai Reddy. Pawan Kalyan also questioned whether notices would be issued to him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X