హైకోర్టుకెళ్లండి: రామలింగరాజుకు నాంపల్లి కోర్టు, చర్లపల్లి జైల్లో ఖైదీల నిరసన
హైదరాబాద్: సత్యం రామలింగ రాజు అప్పీల్ పిటిషన్‌ను నాంపల్లి న్యాయస్థానం సోమవారం నాడు తిరస్కరించింది. దీనిపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకు వెళ్లాలని రామలింగ రాజుకు, ఇతరులకు న్యాయస్థానం సూచించింది.
కాగా, సత్యం కుంభకోణం కేసులో దోషులుగా నిర్ధారితమై జైలు శిక్ష అనుభవిస్తున్న రామలింగ రాజు, ఆయన సోదరుడు రామరాజులు సోమవారం నాడు నాంపల్లి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పును సవాల్ చేస్తూ వారు అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు.

వారు ఏడేళ్ల జైలు శిక్షను సవాల్ చేశారు. ప్రత్యేక కోర్టు తీర్పు కొట్టివేయాలని వారు కోరారు. న్యాయస్థానం కేసు విచారణను వాయిదా వేసి, హైకోర్టుకు వెళ్లాలని ఈ రోజు సూచించింది.
సత్యం కుంభకోణం కేసులో రామలింగ రాజుకు, మరో తొమ్మిది మందికి నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు ఏడేళ్ల జైలు శిక్షను, నగదు జరిమానాను విధించిన విషయం తెలిసిందే. దీనిపై పై కోర్టుకు అప్పీల్ చేసుకునేందుకు న్యాయస్థానం సమయమిచ్చింది. దీంతో సోమవారం రామలింగ రాజు నాంపల్లి కోర్టులో అప్పీల్ చేశారు.
చర్లపల్లి కారాగారంలో ఖైదీల నిరసన
హైదరాబాదులోని చర్లపల్లి కారాగారంలో పలువురు ఖైదీలు నిరసన చేపట్టారు. అల్పాహారం తీసుకోకుండా వారు ఆందోళనకు దిగారు. ఖైదీ శివకుమార్ మృతికి అధికారులే కారణమని, జైలు అధికారులను వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications