Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మీ కోసం నేనొస్తున్నా.: చంద్రబాబు అరెస్టుపై బాలకృష్ణ హాట్ కామెంట్స్, వారికి హెచ్చరిక

గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా బయటికి వస్తారని హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో అవినీతి జరిగిందని సృష్టించి చంద్రబాబును అరెస్ట్ చేశారని ఆయన అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాయలంలో బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు.

ఎలాంటి ఆధరాలు లేకుండా కక్ష సాధింపుతోనే చంద్రబాబుపై కుట్ర చేశారని ఆయన మండిపడ్డారు. సంక్షేమాన్ని గాలికొదిలేసి ప్రతిపక్షాలపై కక్ష సాధింపులే లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారన్నారు. జగన్ జైలుకు వెళ్లొచ్చారని అందరినీ పంపాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.

Nandamuri balakrishna

పేద విద్యార్థుల కోసం చంద్రబాబు ఎన్నో విద్యాసంస్థలు తీసుకొచ్చారని బాలకృష్ణ చెప్పారు. వేలాదిమంది యువతకు ఉపాధి కల్పించిన సంగతి మరిచారా? హిందూపురంలో 1200 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో అవినీతి జరిగితే ఆధారాలు చూపించాలి కదా? ఛార్జీషీటు ఎందుకు వేయలేదు? అని బాలకృష్ణ ప్రశ్నించారు.

ఎలాంటి ఆధారాలు లేకుండానే చంద్రబాబును అరెస్ట్ చేశారని.. రాజకీయ కక్షసాధింపు తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని బాలకృష్ణ దుయ్యబట్టారు. ఇక ఏపీ సీఎం, వైయస్సార్సీపీ అధినేత జగన్‌పై ఈడీ సహా అనేక కేసులున్నాయని.. ఆయన బెయిల్‌పై బయట తిరుగుతున్నారని అన్నారు. ఎన్నికల్లో ఓటమి తప్పదనన్న భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ 16 నెలలు జైలులో ఉండి వచ్చారని.. ఇప్పుడు చంద్రబాబును 16 రోజులైన జైలులో పెట్టాలని జగన్ కుట్ర చేస్తున్నారని బాలకృష్ణ అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ ముందుగా గుజరాత్‌లో ప్రారంభించారని చెప్పారు. సీఎం కేవలం పాలసీ మేకర్ మాత్రమేనని.. అధికారులే అమలు చేస్తారని చెప్పారు. అజేయ కల్లం ప్రతిపాదిస్తే.. ప్రేమ్ చంద్రారెడ్డి అమలు చేశారని తెలిపారు.


ప్రభుత్వం రూ. 370 కోట్ల ఖర్చు చేసి.. 2.13 లక్షల మందికి శిక్షణ ఇచ్చారని బాలకృష్ణ చెప్పారు. డిజైన్ టెక్ సంస్థకు జగన్ ప్రభుత్వం అభినందన లేఖ ఇచ్చిందని తెలిపారు. జగన్ ప్రభుత్వం.. ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా? చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటపడతారని.. ఇలాంటివి ఎన్నో చూశామన్నారు. ఎవరికీ భయపడేది ప్రసక్తే లేదని బాలకృష్ణ స్పష్టం చేశారు.

జగన్ ప్రభుత్వం చేసే కుట్రలను రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని బాలకృష్ణ చెప్పారు. పీల్చే గాలిపైనా పన్నులు వేస్తారని మండిపడ్డారు. మొరిగితే పట్టించుకోనని.. అతిక్రమిస్తే ఉపేక్షించనని బాలకృష్ణ హెచ్చరించారు. ప్రజలు అనుభవించింది చాలని.. మార్పుకోసం సైనికుల్లా పనిచేయాలన్నారు. రాష్ట్రం కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలన్నారు. చంద్రబాబుకు సానుభూతి తెలిపిన ప్రతి ఒక్కరినీ కలుస్తామన్నారు. నేనొస్తున్నా.. ఎవరూ భయపడాల్సిన పనిలేదని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+