మహానాడుకు దూరంగా నందమూరి కుటుంబసభ్యులు, ఎందుకు?
మహానాడుకు నందమూరి కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నారు. విశాఖపట్టణంలో మూడురోజుల పాటు మహానాడు శనివారం నాడు ప్రారంభమైంది.అయితే మహానాడుకు నందమూరి కుటుంబ సభ్యులు వస్తుంటారు.
విశాఖపట్టణం: మహానాడుకు నందమూరి కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నారు. విశాఖపట్టణంలో మూడురోజుల పాటు మహానాడు శనివారం నాడు ప్రారంభమైంది.అయితే మహానాడుకు నందమూరి కుటుంబ సభ్యులు వస్తుంటారు.అయితే ఈ దఫా నందమూరి కుటుంబసభ్యులు దూరంగా ఉన్నారు.
మహానాడు వేదికపైకి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులను ఆహ్వానించిన సమయంలో హరికృష్ణ పేరును పిలిచారు.అయితే హరికృష్ణ కూడ ఈ సమావేశాలకు హాజరుకాలేదు.
హైద్రాబాద్ లో మహానాడు జరిగితే వీలుచూసుకొని ఎన్టీఆర్ కుటుంబసభ్యులు హాజరయ్యేవారు.విశాఖపట్టణంలో మహానాడు సమావేశాలు నిర్వహించడం వల్ల నందమూరి కుటుంబసభ్యులు హాజరుకాలేకపోయారనే అభిప్రాయాలు లేకపోలేదు.

మరోవైపు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడ మహనాడుకు హాజరుకాలేదు. సినిమాషూటింగ్ లో బిజీగా ఉన్న కారణ:గా బాలయ్య కూడ ఈ సమావేశాలకు హాజరుకాలేదని పార్టీవర్గాలు చెబుతున్నాయి.
మరో వైపు ఆదివారం నాడు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని హైద్రాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో నందమూరి కుటుంబసభ్యులు నివాళులర్పించారు.












Click it and Unblock the Notifications