'ఓటర్లను తక్కువగా అంచనా వేసిన జగన్, టిడిపికి 40వేల మెజార్టీ'
నంద్యాల ఉప ఎన్నికలో ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారని టిడిపి నేత గద్దె రామ్మోహన్ సోమవారం అన్నారు. ఓటర్లను ప్రతిపక్ష వైసిపి తక్కువగా అంచనా వేసిందన్నారు.
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికలో ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారని టిడిపి నేత గద్దె రామ్మోహన్ సోమవారం అన్నారు. ఓటర్లను ప్రతిపక్ష వైసిపి తక్కువగా అంచనా వేసిందన్నారు.

30 ఏళ్ల రాజకీయ జీవితంలో చూడలేదు
ప్రతిపక్ష నేత హోదాలో కొనసాగే అర్హత వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి లేదని మండిపడ్డారు. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక ఉప ఎన్నక కోసం ఇన్ని రోజులపాటు ప్రచారం చేసిన ప్రతిపక్ష నేతను ఇంత వరకు చూడలేదన్నారు.
Recommended Video


40వేల మెజార్టీ ఖాయం
జగన్ ప్రచారంతో ప్రజలు అభద్రతా భావానికి గురయ్యారని గద్దె తెలిపారు. నంద్యాల రూరల్ మాదిరిగానే గోస్పాడులో కూడా తెలుగుదేశం పార్టీకే మెజార్టీ వస్తుందని చెప్పారు. మొత్తం మీద 40 వేల మెజార్టీతో టీడీపీ ఘన విజయం సాధిస్తుందన్నారు.

జగన్ పైన మంత్రుల విమర్శలు
నంద్యాల ప్రజలు జగన్ బృందానికి బుద్ధి చెప్పారని మంత్రులు పి నారాయణ, అచ్చెన్నాయుడులు మండిపడ్డారు. ఉప ఎన్నికల ఫలితాల్లో టిడిపి దూసుకెళ్తున్న నేపథ్యంలో వారు మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల ఫలితంతో వైసిపి కనుమరుగు కావడం ఖాయమన్నారు. నంద్యాల ప్రజలు మంచి తీర్పు ఇచ్చారన్నారు.

వైసిపిపై ప్రజల వ్యతిరేకత
వైసిపిపై ప్రజలు చాలా వ్యతిరేకతతో ఉన్నారని చెప్పారు. జగన్ నంద్యాలలో తిష్టవేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయనకే దెబ్బ కొట్టాయన్నారు. చంద్రబాబుపై కాల్చివేత వ్యాఖ్యలు జగన్‌ను దెబ్బతీశాయని వారు అభిప్రాయపడ్డారు.

జగన్ జెండా పీకేస్తారు
జగన్ తన పార్టీ జెండాను త్వరలో పీకేస్తారని మంత్రులు ఎద్దేవా చేశారు. డేరా సచ్చా సౌదా బాబాకు జగన్‌కు పోలిక ఉందని విమర్శించారు. జగన్ ఇక్కడ ఉండవద్దన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు ముఖ్యమంత్రిపై ఇష్టారీతిన మాట్లాడారన్నారు.












Click it and Unblock the Notifications