రోడ్డు ప్రమాదం: నన్నపనేని అల్లుడికి తీవ్ర గాయాలు

వంతెన పై నుండి కారు బోల్తా పడింది. ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. దీంతోకారులో ఉన్న నన్నపనేని అల్లుడు లతీష్ రెడ్డి, డ్రైవర్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని హయత్ నగర్‌లోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే నన్నపనేని రాజకుమారి ఆస్పత్రికి చేరుకున్నారు.
అంతర్రాష్ట్ర దొంగల ముఠా సూత్రధారి అరెస్ట్
అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన కీలక వ్యక్తిని తాండూరు పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. అతను చోరీ చేసిన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో ముఠాకు సంబంధించిన ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి.
ముఠా సభ్యులంతా సొంత అన్నదమ్ములే కాగా వారిలో ఒకరు బాలుడు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ప్రధాన సభ్యుడు వెంకటేష్ మహబూబ్ నగర్ జిల్లా పోలీసుల నుండి తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈ ముఠా కోసం తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని ఐదు జిల్లాల పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications