అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతి రైతులతో భువనేశ్వరి: చేతి గాజు విరాళంగా ఇచ్చి, అండగా ఉంటామని భరోసా

|
Google Oneindia TeluguNews

రాజధాని ఎర్రబాలెం లో రైతుల దీక్షకు మద్దతు తెలిపిన చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు రైతుల దీక్షలో పాల్గొన్నారు . రాజధాని రైతులకు చంద్రబాబు కుటుంబం అండగా ఉంటుందని వారు భరోసా ఇచ్చారు. చంద్రబాబు అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం పరితపించారని చెప్పారు నారా భువనేశ్వరి. గతంలో ఎన్నడూ రాజకీయ కార్యక్రమాలలో పాల్గొనని నారా భువనేశ్వరి రాజధాని రైతుల కోసం నేను సైతం అంటూ ముందుకు వచ్చారు.

రైతుల నమ్మకాన్నిచంద్రబాబు వమ్ము చేయరన్న భువనేశ్వరి

రైతుల నమ్మకాన్నిచంద్రబాబు వమ్ము చేయరన్న భువనేశ్వరి

అమరావతి రైతుల నమ్మకాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వమ్ము చేయరని నారా భువనేశ్వరి అన్నారు. తన కుటుంబం కంటే రాష్ర ప్రజలే ముఖ్యమని చంద్రబాబు భావిస్తారని ఆమె చెప్పారు.ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా ప్రజల కోసం కష్టపడ్డారని తెలిపారు. ప్రజల తరువాతే, తనను, కుటుంబాన్ని పట్టించుకునే వారని ఆమె వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి కుటుంబం అంటా ఆందోళన చెందుతున్నా ఆయన మాత్రం రాష్ట్రం గురించే ఆలోచన చేసేవారని భువనేశ్వరి పేర్కొన్నారు .

అమరావతి పరిరక్షణ సమితికి తన చేతి గాజు విరాళం

అమరావతి పరిరక్షణ సమితికి తన చేతి గాజు విరాళం

ఏపీని నంబర్ వన్ గా చేయడానికి చంద్రబాబు నిరంతరం కృషి చేశారని, అహర్నిశలు పరితపించారని చెప్పుకొచ్చారు. రాత్రింబవళ్లు చంద్రబాబు రాష్ట్రం కోసం కష్టపడ్డారని భువనేశ్వరి పేర్కొన్నారు .. రైతులకు పూర్తి మద్దతుగా మా కుంటుంబం అండగా ఉంటుందని చెప్పారు.మహిళలు పడుతున్న బాధను తోటి మహిళగా అర్థం చేసుకున్నానని భువనేశ్వరి అన్నారు. అమరావతి పరిరక్షణ సమితికి చంద్రబాబు భార్య భువనేశ్వరి తన చేతి గాజును విరాళంగా ఇచ్చారు.

రైతుల పోరాటానికి విరాళాలు ఇస్తున్న రాజధాని ప్రాంత వాసులు

రైతుల పోరాటానికి విరాళాలు ఇస్తున్న రాజధాని ప్రాంత వాసులు

ఎర్రబాలెంలో రైతుల దీక్షలో పాల్గొన్న చంద్రబాబు, భువనేశ్వరి రైతులకు తామున్నామని భరోసా ఇచ్చారు. భువనేశ్వరి ఏకంగా తన చేతిని గాజును తీసి విరాళంగా ఇచ్చారు. ఇక నూతన సంవత్సర వేడుకలకు పెట్టాలనుకున్న ఖర్చును అమరావతిలో రాజధాని కోసం నిరసనలు తెలుపుతున్న రైతులకు విరాళంగా ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చిన నేపధ్యంలో పలువురు రాజధాని పరిరక్షణ సమితికి విరాళాలు అందించారు. చంద్రబాబు అన్నం తినేటప్పుడు కూడా మీగురించే తలుచుకుంటున్నారని చెప్పిన భువనేశ్వరి రాజధాని రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

English summary
Bhuvaneswari, wife of former AP CM Chandrababu Naidu, has visited the capital and offered prayers to Durgamma. Later she spoke to media and asserted that "Chandrababu is that leader who always thinks of people and their welfare and he has worked for Amaravati." "Family is the second priority for Chandrababu as he always strived for farmers welfare hence developed Amaravati, " Bhuvaneswari added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X