జగన్! ప్రభుత్వాన్ని కూల్చెయ్: లోకేష్, 'పవన్ కళ్యాణ్ కాళ్లు వదలరు'

చిత్తూరు: వైసిపి అధినేత జగన్‌కు చేతనైతే చంద్రబాబు ప్రభుత్వాన్ని ఒక్కరోజులో కూల్చాలని టిడిపి నేత నారా లోకేష్ బుధవారం నాడు సవాల్ విసిరారు. అభివృద్ధి చూసి తమ పార్టీలోకి వస్తున్న ఎమ్మెల్యేలను తాము ఆపలేమని స్పష్టం చేశారు. చంద్రబాబుపై ప్రతిపక్షాలు అనవసర విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు.

టిఆర్ఎస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కు అయ్యాయని ఆరోపించారు. అందుకే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వైసిపి పోటీ చేయలేదని చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో తమకు 7 లక్షల ఓట్లు వచ్చాయని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం నిర్మాణాత్మక పాత్ర పోషించాలని హితవు పలికారు.

చంద్రబాబుకు నైతిక విలువలు లేవు: కొడాలి నాని

చంద్రబాబు ప్రోత్సహిస్తున్న పార్టీ పిరాయింపులపై వైసిపి ఎమ్మెల్యే కొడాలి నాని బుధవారం ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, క్యాంపు రాజకీయాలు చేయడం ఆయనకు అలవాటేననినాని, వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు నైతిక విలువలు లేవన్నారు.

Nara Lokesh challenges YS Jagan to raze government

చేశారు. పార్టీ పిరాయింపులపై తాము గవర్నర్, స్పీకర్‌కు ఫిర్యాదు చేయాలనుకోవడంలేదని, ఒకవేళ ఫిర్యాదు చేసినా ఉపయోగం ఉండదన్నారు. ఒకరిద్దరు పార్టీ నుంచి వెళ్లినా తమకు వచ్చిన నష్టమేం లేదన్నారు. మార్చి 6న వైసిపి కార్యాలయాన్ని విజయవాడలో ప్రారంభించనున్నట్టు చెప్పారు.

డబ్బులు, పదవులు ఎరవేసి ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్నారని ధ్వజమెత్తారు. పార్టీలు మారినప్పుడు పదవులకు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం రాజకీయాల్లో నిబద్ధతకు చిహ్నం అన్నారు. సీఎం కెసిఆర్.. మూడుసార్లు తన పదవులకు రాజీనామా చేశారని గుర్తు చేశారు.

చంద్రబాబు ప్రభుత్వం నుంచి బయటకు రాగానే ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సిద్దిపేట నుంచి పోటీ చేసి గెలిచారని, అలాగే ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసి మళ్లీ గెలిచారన్నారు. దానం నాగేందర్‌ను వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకు వచ్చినప్పుడు కూడా ఆయనతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించారన్నారు.

వైయస్, ఎన్టీఆర్, కెసిఆర్, వైయస్ జగన్‌ల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని చెప్పారు. గతంలో కెసిఆర్‌ను ఇష్టారీతిన తిట్టిన చంద్రబాబు... ఇప్పుడు తనను తాను తిట్టుకున్నట్లు అయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ బయటకు వచ్చినప్పుడు 18 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించారన్నారు.

క్యాంపులు పెట్టడం, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం చంద్రబాబుకు రాజకీయాల్లో మొదటి నుంచి ఉన్న అలవాటు అన్నారు. పవన్ కళ్యాణ్, సోనియా గాంధీ కాళ్లు పట్టుకొని వదలరని కొడాలి నాని ఎద్దేవా చేశారు. దమ్ముంటే ఆ నలుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలన్నారు.

జలీల్ ఖాన్‌కు మంత్రి ఉమ బ్రోకరేజీ చేశారని జిల్లాలో అందరూ చెబుతున్నారన్నారు. భూమా నాగిరెడ్డి,అఖిల ప్రియ.. శోబా నాగిరెడ్డి అడుగుజాడల్లో నడవాలంటే వాళ్లు కూడా తమ పదవులకు రాజీనామా చేయాలని సవాల్ చేశారు. తాము ఎప్పుడూ జగన్ వెంటే ఉంటామని చెప్పారు.

లైపాక్షి ఉత్సవాలు విజయవంతం కోసం సైకిల్ ర్యాలీ

అనంతపురం జిల్లాలో లేపాక్షి ఉత్సవాలను విజయవంతం చేయాలని బుధవారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సైకిల్ ర్యాలని ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించారు. చిలమత్తూరు మండలం కొరికొండ చెక్ పోస్టు నుంచి లేపాక్షి నంది విగ్రహం వరకు సైకిల్ ర్యాలీ సాగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+