వ‌చ్చేవారం సీఎం జ‌గ‌న్‌కు సంబంధించిన పెద్ద కుంభ‌కోణాన్ని బ‌య‌ట పెట్ట‌బోతున్నా: నారా లోకేష్‌

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి సంబంధించిన ఓ పెద్ద కుంభకోణాన్ని వచ్చేవారం బ‌య‌ట పెట్ట‌బోతున్న‌ట్లు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ప్ర‌క‌టించారు. ''అంద‌రికీ ఆరోగ్య‌మ‌స్తు - ఇంటికి శుభ‌మ‌స్తు'' నినాదంతో సొంత ఖ‌ర్చుతో మంగ‌ళ‌గిరిలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య‌కేంద్రాన్ని ఆయ‌న ప్రారంభించారు. ఈ వైద్య కేంద్రంద్వారా ఆరోగ్య సంజీవ‌ని పేరుతో నియోజ‌క‌వ‌ర్గంలోని పేద‌ల‌కు ఉచితంగా వైద్య‌సేవ‌లందించ‌నున్నారు. ఇందుకు అవ‌స‌ర‌మైన వైద్యులు, సిబ్బంది, చికిత్స ప‌రిక‌రాల‌ను లోకేష్ స‌మ‌కూర్చారు. దాదాపు 200కు పైగా రోగ‌నిర్థార‌ణ ప‌రీక్ష‌ల‌ను ఉచితంగా చేయ‌నున్నారు

nara lokesh comments on cm ys jagan

Recommended Video

    సిగ్గులేకుండా అబద్ధాలా, డబ్బా కొట్టుకోవటం జగన్ రెడ్డికి వ్యసనం *AndhraPradesh | Telugu OneIndia

    ఈ సంద‌ర్భంగా లోకేష్ మాట్లాడుతూ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌వి 10వ తరగతి పాస్, డిగ్రీ ఫెయిల్ అయిన తెలివితేటల‌ని, అత‌ని టైమైపోయి ఇంటికెళ్లే ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హ‌యాంలో రాష్ట్రానికి వ‌చ్చిన ప‌రిశ్ర‌మ‌ల‌కంటే బ‌య‌ట‌కు వెళ్లిన‌వే ఎక్కువ‌గా ఉన్నాయ‌న్నారు. పెట్టుబ‌డులు పెట్టాలి అంటే ముందుగా ముఖ్య‌మంత్రి వాటా ఎంత‌? అనే చ‌ర్చ వ‌స్తుంద‌ని, రాష్ట్రానికి వ‌చ్చిన ప‌రిశ్ర‌మ‌ల‌పై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేస్తే తాను చ‌ర్చకు సిద్ధంగా ఉన్న‌ట్లు స‌వాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డి రిబ్బన్ కటింగ్ చేస్తున్న ప్రతీ పరిశ్రమా తెలుగుదేశం ప్రభుత్వంలో వ‌చ్చిన‌వేన‌న్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 5 లక్షల ఉద్యోగుల కల్పన జరిగిందని జగన్ ప్రభుత్వమే ఒప్పుకుంద‌ని గుర్తుచేశారు. సీబీఐ, ఈడీ, ఐటీకి భ‌య‌ప‌డి సీఎం జ‌గ‌న్ ఢిల్లీలో త‌ల‌వంచార‌న్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+