Nara Lokesh : టీడీపీ ఎమ్మెల్సీ విజేతలకు నారా లోకేష్ సన్మానం-పాదయాత్రలో భేటీ..!

ఏపీలో వైసీపీ హవాను తట్టుకుని పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా గెలిచిన ముగ్గురు టీడీపీ నేతలు రాంగోపాల్ రెడ్డి, శ్రీకాంత్, చిరంజీవిరావు ఇవాళ లోకేష్ తో భేటీ అయ్యారు.

కదిరి : ఏపీలో తాజాగా జరిగిన పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏమాత్రం అంచనా లేకుండా బరిలోకి దిగిన టీడీపీ అభ్యర్ధులు రాం గోపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్, వేపాడ చిరంజీవి రావు అనూహ్య విజయాలు సాధించారు. అదీ ఆషామాషీ మెజారిటీతో కాదు. దీంతో ఈ ముగ్గురు అభ్యర్ధులపై ఇప్పుడు పార్టీలో ప్రశంసల జల్లు కురుస్తోంది.

nara lokesh felicitates three mlc winners ramgopal reddy, chiranjeevirao and srikanth

ఈ నేపథ్యంలో ఇవాళ ముగ్గురు టీడీపీ ఎమ్మెల్సీలు కదిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న యువనేత నారాలోకేష్ ను కలిశారు. లోకేష్ ను కలిసిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్సీలు రాం గోపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్, వేపాడ చిరంజీవి రావు తమ ధృవపత్రాలను చూపించారు. అనంతరం లోకేష్ వారిని ఘనంగా సన్మానించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం కృషి చేస్తామని వారు లోకేష్ కు తెలిపారు.

nara lokesh felicitates three mlc winners ramgopal reddy, chiranjeevirao and srikanth

టీడీపీ తరఫున పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా గెలిచిన రాం గోపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్, వేపాడ చిరంజీవి రావు రాబోయే రోజుల్లో ఆ పార్టీకి కీలకం కాబోతున్నారు. ఇప్పటికే అసెంబ్లీలో వైసీపీ మెజారిటీ, స్ధానిక సంస్ధల్లో ఉన్న మెజారిటీ కారణంగా ఎమ్మెల్సీలను అనాయాసంగా గెలుస్తూ మండలిలో బలం అమాంతంపెంచుకున్న అధికార పార్టీని ఎదుర్కొంటూ వీరు టీడీపీ ఉనికి చాటాల్సి ఉంది. దీంతో ఈ ముగ్గురు అభ్యర్ధులను చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా కీలకంగా భావిస్తున్నారు. అసలే మండలిలో లోకేష్ కూడా లేని పరిస్దితుల్లో టీడీపీ వాదన వినిపించాల్సిన బాధ్యత కూడా వీరిపైనే ఉంది.

nara lokesh felicitates three mlc winners ramgopal reddy, chiranjeevirao and srikanth
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+