మోడీ వెన్నుపోటు పొడిచారు: పవన్, జగన్‌లపై లోకేష్ ఆగ్రహం

తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేస్తారనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని, అంతేగాక, నాలుగేళ్లు ఓపిక పట్టామని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. కాకినాడ జేఎన్టీయూ మైదానంలో జరుగుతున్న ధర్మపోరాట దీక్షలో లోకేశ్ పాల్గొని ప్రసంగించారు.

ప్రధాని మోడీ ఏపీకి వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. తెలుగు జాతితో పెట్టుకోవద్దని ప్రధాని మోడీని లోకేష్ హెచ్చరించారు. జగన్, పవన్.. మోడీని విమర్శించకుండా, చంద్రబాబును విమర్శిస్తున్నారని అన్నారు. జగన్, పవన్‌కు చిత్తశుద్ధి ఉంటే ప్రధాని మోడీని నిలదీయాలన్నారు.

nara lokesh fires at bjp and modi

తనపై కూడా ఆధారాల్లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ఎంపీల రాజీనామాలు ఓ డ్రామా లోకేష్ అన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని నారా లోకేష్‌ ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర ప్రజలను పవన్ రెచ్చగొడుతున్నారని లోకేష్ అన్నారు.

ఉత్తరాంధ్రను అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. లోటు బడ్జెట్‌ ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా ఏపీని అభివృద్ధి చేస్తున్నారని లోకేష్ తెలిపారు. ఇబ్బందులున్నా రైతులకు రుణమాఫీ చేశారని అన్నారు. తెలుగు జాతితో పెట్టుకోవద్దని, కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ చూసింది కేవలం ట్రైలర్‌ మాత్రమేనని, 2019లో అసలైన సినిమా చూస్తుందని లోకేష్ మరోసారి వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+