వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మ ఒడి కాదు ఆంక్షల బడి ... జగన్ టార్గెట్ గా లోకేష్ ట్వీట్ల హడావిడి

|
Google Oneindia TeluguNews

Recommended Video

అమ్మఒడి పథకం పై అమలు పై విరుచుకుపడ్డ లోకేష్ || Nara Lokesh Fires On Jagan About Amma Odi Scheme

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. అమ్మ ఒడి కాదు ఆంక్షల బడి అని అమ్మ ఒడి పతాకాన్ని ఉద్దేశించి ఆయన ట్వీట్ ల వర్షం కురిపించారు. మాటలు ఘనం.. చేతలు శూన్యం అంటూ విరుచుకుపడ్డారు. వైసిపి సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమ్మ ఒడి పథకాన్ని అందిస్తుంది అని చెప్పి పాఠశాలల, కళాశాలల విద్యార్థులందరికీ ఇస్తామని చెప్పి మాట మార్చారని మండిపడ్డారు నారా లోకేష్ .

ఎన్నికల సమయంలో అమ్మ ఒడి హామీ .. ఇప్పుడు మాట తప్పారని లోకేష్ ఫైర్

ఎన్నికల సమయంలో అమ్మ ఒడి హామీ .. ఇప్పుడు మాట తప్పారని లోకేష్ ఫైర్

జగన్ సర్కార్‌పై మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాటల దాడి పెంచారు. ట్విట్టర్‌ వేదికగా రోజుకో అంశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి, వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న లోకేష్ తాజాగా అమ్మ ఒడిపథకం విషయంలో జగన్ మాట మార్చిన తీరును సోషల్ మీడియా వేదికగా ఎండగట్టారు. అసెంబ్లీ సాక్షిగా అమ్మ ఒడి విషయంలో జగన్ మాట తప్పారు, మడమ తిప్పారు అంటూ ఎద్దేవా చేశారు.రాష్ట్రంలోని విద్యార్థులు అందరికీ ఈ పథకం వర్తింపజేస్తామని చెప్పి ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికే అని మాట మార్చటం కరెక్ట్ కాదన్నారు.

మాట తప్పం .. మడమ తిప్పం అని .. ఇప్పుడు మాట తప్పారని లోకేష్ ఆగ్రహం

మాట తప్పం .. మడమ తిప్పం అని .. ఇప్పుడు మాట తప్పారని లోకేష్ ఆగ్రహం

అమ్మఒడి పథకం పై వరుస ట్వీట్లు చేసిన నారా లోకేష్ అమ్మ ఒడి పథకం గురించి రోజుకో రకమైన ప్రకటనలు చేశారని , ప్రకటనల ఆరాటమే తప్ప విద్యార్థులకు జరిగిన మేలు ఏమీ లేదని మండిపడ్డారు.అర్హులైన విద్యార్థులకు షరతుల పేరుతో అమ్మ ఒడి పథకం రాకుండా చేస్తారా అంటూ మండిపడ్డారు. అసలు 80 లక్షల మందికి లబ్ది చేకూరుతుంది అని భావిస్తే సగానికి సగం మందిని ఎలా తగ్గిస్తారని లోకేష్ జగన్ ను ప్రశ్నించారు. మొదట ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలలో చదివేవారికి లేదని మంత్రి ప్రకటించారు. ఆ తరువాత ఎక్కడ, ఏ స్కూలైనా అమ్మ ఒడి ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అసెంబ్లీకి వచ్చేసరికి తెల్లకార్డు ఉన్నవారికే అని ప్రకటించారని నారా లోకేష్ వైసిపి సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊసరవెల్లి రంగులు మార్చినట్టు మాటలు మార్చారని లోకేష్ మండిపడ్డారు. పిల్లల్లో ఒకరికే అని చెప్పి అమ్మ ఒడిని కాస్తా 'ఆంక్షల బడి' చేశారన్నారు లోకేష్ . ఎన్నికల సభల్లోనూ, పాదయాత్రలోనూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి స్కూల్ కి వెళ్లే ప్రతి బిడ్డకి రూ.15 వేలు సాయం చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వైసిపి అధికారంలోకి వచ్చాక అమ్మ ఒడి అనగానే తడబడటం ప్రారంభించారు అంటూ ట్వీట్ చేసి అమ్మఒడి పథకం పై సర్కారు తీరును తెలియజేశారు. మాట తప్పమని, మడమ తిప్పమని చెప్పి మాట తప్పారని ఎద్దేవా చేశారు.

80 లక్షల మందికి ఇవ్వాల్సిన అమ్మ ఒడి 43 లక్షలకే పరిమితం చేస్తూ షరతులు పెట్టారన్న లోకేష్

80 లక్షల మందికి ఇవ్వాల్సిన అమ్మ ఒడి 43 లక్షలకే పరిమితం చేస్తూ షరతులు పెట్టారన్న లోకేష్

జగన్ గారి హామీల ప్రకారం రాష్ట్రంలో ఒకటి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు చదివే సుమారు 80 లక్షల మందికి అమ్మఒడి ఇవ్వాలని కానీ అసెంబ్లీకి వచ్చేసరికి బోలెడు షరతులు పెట్టి లబ్దిదారులను 43 లక్షలకు తగ్గించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు . అంటే సగానికి సగం చేశారని పేర్కొన్నారు. మాటలు ఘనం, కోతలు సగం ఇదీ జగన్ గారి హామీల తీరు అంటూ వైసిపి ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఏది ఏమైనప్పటికీ సోషల్ మీడియా వేదికగా చెలరేగిపోతున్న నారా లోకేష్ అధికారంలో ఉన్నప్పటికంటే ప్రతిపక్షంలో ఉన్న నాయకుడిగా చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నారు.

వైసీపీ సర్కార్ అందిస్తున్న పథకాలపై ఆయన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సోషల్ మీడియాలో అందరికీ తెలిసేలా పోస్ట్ చేస్తున్నారు.

English summary
Nara Lokesh, who made a series of tweets on the Amma odi scheme, has made some kind of announcements. Eligible students were suffering a lot under conditions name questioned lokesh . First, the minister declared that there is no private, corporate schools and colleges. After that, the chief minister announced that the every school and college will be given the scheme .. and after that they annouced only white ration card holders will get the scheme .Nara Lokesh outraged over YCP government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X