కోటి కోట్లు: జగన్‌పై లోకేష్ నిప్పులు, 'ఈ దేశం మనదే'
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ గురువారం మరోసారి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో లక్షల కోట్లు సంపాదించిన నేరస్తుల అవినీతి జాతి నేతగా ఎదిగిన జగన్.. తెలుగు జాతి భవిష్యత్తును నాశనం చసే కుట్రలు చేస్తున్నారన్నారు.
లక్ష కోట్ల రూపాయలు వెదజల్లి వాటితో గెలిచి కోటి కోట్లు సంపాదించాలని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. అవినీతి జాతికి నేతగా ఎదిగిన జగన్ ఆగడాలపై యువత తిరగ బడాలని పిలుపునిచ్చారు. తొమ్మిదేళ్లుగా రాష్ట్రంలో స్వార్థ రాజకీయ నాయకులు నెత్తురు పారించారని ఆవేదన వ్యక్తం చేశారు.

దీని వల్ల ఐటీ ఉద్యోగాలు రాష్ట్రాన్ని వదిలి వెళ్లాయని, సర్కారు కొలువులను అంగడి సరుకుల్లా అమ్మకానికి పెట్టారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అమ్మాయిలకు రక్షణ కరవైందని, 2014 రాజకీయ ధర్మయుద్ధంలో యువతరమే అవినీతి పార్టీలకు బుద్ధి చెప్పాలని ఈ పోరాటంలో తాను కూడా పాల్గొంటానని చెప్పారు. టిడిపిని బలపరిచి యువత భవితకు పునాదులు వేయాలన్నారు.
గురువారం హైదరాబాదులో నారా లోకేష్ జన్మదిన వేడుకలు టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఆంజనేయ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అవినీతి రాజకీయాలపై 'ఈ దేశం మనదే' కరపత్రాన్ని విద్యార్థుల సమక్షంలో లోకేష్ ఆవిష్కరించారు. అభిమానుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 31 కిలోల కేక్‌ను ఎన్టీఆర్ భవన్‌లో లోకేష్ కట్ చేశారు.












Click it and Unblock the Notifications