తాడేపల్లి ప్యాలస్ లో ఎలా నిద్రపడుతుంది జగన్ రెడ్డి? ఆ వీడియోతో నారాలోకేష్ ఫైర్

విజయనగరం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని ఓ యువతిని అత్యంత దారుణంగా పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. డెంకాడ మండలం దయాల్ నగర్ బేతన పల్లి మధ్య గుర్తు తెలియని ఒక మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో వారు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతురాలి శరీరమంతా గుర్తుపట్టలేనంతగా కాలిపోవడం తో, ఎవరో ఆమెను చంపి ఆనవాళ్లు దొరక్కుండా అక్కడికి తీసుకు వచ్చి తగలబెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

విజయనగరం జిల్లాలో యువతి సజీవ దహనం ఘటన


విజయనగరం జిల్లాలో జరిగిన యువతి సజీవ దహనం ఘటనలో యువతిని చంపటానికి ముందు ఆమెపై దుండగులు లైంగిక దాడికి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక మృతురాలి ఆనవాళ్లు లేకపోవడంతో ఆమె ఏ ప్రాంతానికి చెందిన వారు తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇటీవల కాలంలో పిఎస్ లో నమోదైన యువతి మిస్సింగ్ ఫిర్యాదులను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆమె ఎవరు? ఆమెను ఇలా సజీవ దహనం చేసిన వారెవరు? అసలేం జరిగింది అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది.

విజయనగరం ఘటనపై జగన్ ను టార్గెట్ చేసిన లోకేష్

విజయనగరం ఘటనపై జగన్ ను టార్గెట్ చేసిన లోకేష్


ఇదిలా ఉంటే విజయనగరం జిల్లాలో యువతిని దారుణంగా హతమార్చి పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసిపి పాలనలో మహిళలు బయటకి రావాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకో ఆడబిడ్డ బలైపోతుంటే తాడేపల్లి ప్యాలస్ లో ఎలా నిద్రపడుతుంది జగన్ రెడ్డి గారు? అంటూ ప్రశ్నించారు. విజయనగరం జిల్లాలో అమానవీయ ఘటన జరిగినా స్పందించలేనంతగా ఏం వెలగబెడుతున్నారు? అంటూ లోకేష్ మండిపడ్డారు.

ఎక్కడ గన్? ఎక్కడ జగన్ .. ప్రశ్నించిన లోకేష్

ఎక్కడ గన్? ఎక్కడ జగన్ .. ప్రశ్నించిన లోకేష్


విజయనగరం జిల్లా డెంకాడ మండలం బేతనపల్లి సమీపంలో యువతిని అత్యాచారం చెయ్యడంతో పాటు గుర్తు పట్టలేనంతగా పెట్రోల్ పోసి తగలబెట్టారు మృగాళ్లు. ఎక్కడ గన్? ఎక్కడ జగన్? ఇప్పటికైనా మేల్కొని మహిళలకు రక్షణ కల్పించండి అంటూ నారా లోకేష్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ని టార్గెట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని, సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్లో ప్రశాంతంగా నిద్ర పోతున్నారు అంటూ వ్యాఖ్యానించారు.

 యువతిని పెట్రోల్ పోసి తగలబెట్టిన వెధవల్ని నడి రోడ్డుపై ఉరి తియ్యండి

యువతిని పెట్రోల్ పోసి తగలబెట్టిన వెధవల్ని నడి రోడ్డుపై ఉరి తియ్యండి


యువతిని పెట్రోల్ పోసి తగలబెట్టిన వెధవల్ని నడి రోడ్డుపై ఉరి తీసి మహిళల భద్రతకి భరోసా ఇవ్వండి అంటూ నారా లోకేష్ జగన్ మోహన్ రెడ్డి కి ఏపీలో మహిళలకు రక్షణ కల్పించాలంటూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. ఇక ఇదే సమయంలో విజయనగరం ఘటనకు సంబంధించి వీడియోని కూడా పోస్ట్ చేసి రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+