పేలని జ'గన్' హస్తిన పయనం ఎందుకు? ఆసక్తికర ఆప్షన్లు ఇచ్చిన లోకేష్!!

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఏపీలో జగన్ పాలన వైఫల్యాలను ఎండగడుతూ జగన్ ను టార్గెట్ చేస్తున్న లోకేష్ జగన్ ఢిల్లీ పర్యటన పై ఆప్షన్లు ఇచ్చి మరీ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. పేలని జ'గన్' హస్తిన పయనం ఎందుకు? అని ప్రశ్నించిన లోకేష్ దానికి నాలుగు ఆప్షన్లను ట్విట్టర్ వేదికగా ఇచ్చారు.

జగన్ ఢిల్లీ పర్యటన ఎందుకంటూ ఆప్షన్లు ఇచ్చిన లోకేష్

జగన్ ఢిల్లీ పర్యటన ఎందుకంటూ ఆప్షన్లు ఇచ్చిన లోకేష్

ఏ వన్ బాబాయ్ హత్య లో దొరికిన అవినాష్ రెడ్డి ని తప్పించడం కోసం, ఏ టూ తాను కొట్టేస్తే కాగ్ పట్టేసిన 48 వేల కోట్ల వ్యవహారాన్ని కామప్ చేయడం కోసం, ఏత్రీ తనపై సీబీఐ, ఈడీ కేసుల దర్యాప్తు ఆపేయాలని, ఏ ఫోర్ లక్షల కోట్ల ఆస్తి లో చెల్లికి చిల్లిగవ్వ కూడా దక్కకుండా మహిళలకు ఆస్తి హక్కు రద్దు చేయాలని, అంటూ నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. అంతేకాదు నిత్యావసరాలు, డీజిల్, పెట్రోల్ ధరల్లో ఏపీని ఇండియాలోనే నెంబర్ 1 గా నిలిపి సామాన్యుల నడ్డి విరిచారు జగన్ రెడ్డి అంటూ లోకేష్ జగన్మోహన్రెడ్డిని టార్గెట్ చేశారు.

జగన్ బాదుడికి జనం బెంబేలు

జగన్ బాదుడికి జనం బెంబేలు

వైయస్ జగన్మోహన్ రెడ్డి బాదుడుకి జనం బెంబేలెత్తిపోతున్నారు అంటూ మండిపడిన లోకేష్ రాష్ట్రంలో పరిస్థితిని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. సీఎం గా ప్రమాణస్వీకారం చేస్తూ విద్యుత్ ఛార్జీలు తగ్గించేస్తానని అబద్దం చెప్పింది దేశంలో ఒక్క జగన్ రెడ్డి మాత్రమే అని లోకేష్ విమర్శలు గుప్పించారు.

7 సార్లు విద్యుత్ ధరలు పెంచి రూ.16 వేల కోట్లు కొట్టేసారు అంటూ లోకేష్ జగన్ పై ఆరోపణలు గుప్పించారు. ఇక ఏపీలో టిడిపి హయాంలో ప్రజల జీవన ప్రమాణాలకు, వైసిపి హయాంలో ప్రజల జీవన ప్రమాణాలను మధ్య వ్యత్యాసాన్ని చెప్పిన లోకేష్ జగన్ సర్కారు హయాంలో బాదుడే బాదుడు అంటూ మండిపడ్డారు.

సంవత్సరానికి ప్రతి కుటుంబం నుండి జగన్ లక్షా 8 వేల రూపాయలు కొట్టేస్తున్నాడు

సంవత్సరానికి ప్రతి కుటుంబం నుండి జగన్ లక్షా 8 వేల రూపాయలు కొట్టేస్తున్నాడు

ఒక పేద మధ్య తరగతి కుటుంబం బతకడానికి నెలకు 2019లో 11 వేల రూపాయలు సరిపోయేది అని, జగన్ మోహన్ రెడ్డి పాలన లో 2022 లో ఇరవై వేల రూపాయల పైనే ఖర్చు అవుతుంది అంటూ లోకేష్ పేర్కొన్నారు .సంవత్సరానికి ప్రతి కుటుంబం నుండి జగన్మోహన్ రెడ్డి ఒక లక్షా 8 వేల రూపాయలు కొట్టేస్తున్నాడని లోకేష్ మండిపడ్డారు.

2014- 2019 తెలుగుదేశం పాలనలో విద్యుత్.చార్జీలు 200 నుంచి 300 రూపాయల వరకు ఉంటే, 2019 నుంచి 2022 మధ్య వైసీపీ పాలనలో విద్యుత్ చార్జీలు 500 రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు ఉన్నాయని, జగన్ హయాంలో ఏకంగా 500 రూపాయల చార్జీలు పెరిగాయని పేర్కొన్నారు.

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల విషయంలో లెక్కలు చెప్పిన లోకేష్

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల విషయంలో లెక్కలు చెప్పిన లోకేష్

ఇక టీడీపీ హయాంలో పెట్రోలు 76 రూపాయలు ఉంటే వైసిపి హయాంలో 117 రూపాయలకు పెరిగిందని అప్పటితో పోలిస్తే ఏకంగా 41 రూపాయలు పెరుగుదల ఉందని వెల్లడించారు.

డీజిల్ కు 65 రూపాయలు టిడిపి హయాంలో ఉంటే, వైసిపి పాలనలో డీజిల్ ధర 103 రూపాయలకు చేరిందని, ముప్పై ఎనిమిది రూపాయల మేర డీజిల్ ధర పెరిగిందన్నారు. వంటగ్యాస్ ధర 726 రూపాయలు టిడిపి హయాంలో ఉంటే, వైసిపి హయాంలో 1050 కి చేరిందని లోకేష్ వెల్లడించారు. ఏకంగా గ్యాస్ మీద 324 రూపాయలు పెరిగిందని పేర్కొన్నారు.

ఇంటి పన్ను, చెత్త పన్నుల బాదుడుపై లోకేష్ లెక్కలు

ఇంటి పన్ను, చెత్త పన్నుల బాదుడుపై లోకేష్ లెక్కలు

టిడిపి హయాంలో ఇంటి పన్ను రెండు వందల రూపాయలు ఉంటే వైసిపి హయాంలో ఇంటి పన్ను ఎనిమిది వందల రూపాయలకు పెరిగిందని ఏకంగా ఆరు వందల రూపాయలు ఇంటి పన్ను పెరిగిందని పేర్కొన్నారు. ఇక టిడిపి హయాంలో చెత్త పై పన్ను లేదని వైసిపి హయాంలో 120 రూపాయలు చొప్పున చెత్తపన్ను వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.టిడిపి హయాంలో ఇసుక లారీ ధర పది వేలు రూపాయలు ఉంటే వైసిపి హయాంలో ఇసుక ధర 40 వేల రూపాయలుగా ఉందని, 30 వేల రూపాయల మేర ఇసుక ధర పెరిగిందని వెల్లడించారు.

టీడీపీ పాలనకు జగన్ పాలనకు పెరిగిన ధరల లెక్కలు చెప్పిన లోకేష్

టీడీపీ పాలనకు జగన్ పాలనకు పెరిగిన ధరల లెక్కలు చెప్పిన లోకేష్

టిడిపి హయాంలో సిమెంట్ ధర రెండు వందల ఇరవై రూపాయలు ఉంటే, వైసీపీ హయాంలో సిమెంట్ ధర 380 రూపాయలు గా ఉందని, 160 రూపాయల మేర సిమెంట్ ధర పెరిగిందని లెక్క చెప్పారు. టిడిపి హయాంలో మద్యం క్వార్టర్ ధర 60 రూపాయలు ఉంటే, వైసిపి హయాంలో నూట అరవై రూపాయలకు పెరిగిందని, 100 రూపాయల మేర మద్యం ధరలు పెంచినట్టుగా వెల్లడించారు. ఇక ఫైబర్ నెట్ 149 రూపాయలు టిడిపి హయాంలో ఉంటే, వైసీపీ హయాంలో ఫైబర్ నెట్ 350 రూపాయలకు పెరిగిందని, రెండు వందల ఒక రూపాయి మేర పెరుగుదల నమోదైనట్టు గా పేర్కొన్నారు.

ధరలు దిగిరావాలంటే జగన్ దిగి పోవాల్సిందే

ధరలు దిగిరావాలంటే జగన్ దిగి పోవాల్సిందే

ప్రజల సగటు నెల సంపాదన 2019లో 15000 ఉండగా 11 వేలు ఖర్చు ఉండేదని, నాలుగు వేల రూపాయల మిగులు ఉండేదని పేర్కొన్న లోకేష్, 2022 లో ప్రజల సగటు నెల సంపాదన 15,000 గానే ఉందని నెల ఖర్చు మాత్రమే 20000 గా ఉందని, లోటు 9000 కనిపిస్తుంది అంటూ లోకేష్ వెల్లడించారు. ఇక నిత్యావసర వస్తువుల ధరలను కూడా నేడు టిడిపి హయాంలో ఎంత ఉండేవి, ప్రస్తుతం వైసిపి హయాంలో ఎంత ఉంది అన్న లెక్కచెప్పిన లోకేష్ ధరలు దిగి రావాలంటే జగన్ దిగి పోవాల్సిందే .. కలిసి పోరాడుదాం.. నియంత ప్రభుత్వం మెడలు వంచుదాము అంటూ లోకేష్ ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+