షాకింగ్: 'పేరుకే హోంమంత్రి, చినరాజప్ప శాఖలో నారా లోకేష్‌దే చక్రం'
గుంటూరు: హోంమంత్రి చినరాజప్ప పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు మంగళవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తుని విధ్వంసం కేసులో భూమన కరుణాకర్ రెడ్డిని సిఐడి విచారిస్తున్న సందర్భంగా ఆయన కార్యాలయానికి వచ్చారు.
ఈ సందర్భంగా అంబటి మాట్లాడారు. చినరాజప్ప కేవలం పేరుకే హోంమంత్రి అని చెప్పారు. అసలు పోలీసు శాఖలో ఏం జరుగుతుందో కూడా ఆయనకు తెలియదన్నారు. అంతా టిడిపి యువనేత నారా లోకేష్ చూసుకుంటారని విమర్శించారు.
ఇది దురదృష్టకరమన్నారు. హోంమంత్రి అసెంబ్లీ సాక్షిగా చెప్పే మాటలకు, కోర్టుల్లో ఆ శాఖ దాఖలు చేసే అఫిడవిట్లకు పొంతన ఉండదన్నారు. చినరాజప్ప అమాయక మంత్రిగా అభిప్రాయపడ్డారు.
Also Read: హెచ్చరిక: 'నేను చిరంజీవి అభిమానినే, కానీ ఇప్పుడు నచ్చట్లా'

చినరాజప్ప అమాయక మంత్రి అంటున్నారని, తుని ఘటనలో జగన్ మనుషులు ఉన్నారని ఆయన కూడా చెబుతున్నారు కదా అని మీడియా ప్రశ్నించగా.. ఎలా చెప్పగలరని ప్రశ్నించారు. బాధ్యత గల పౌరుడిగా విచారణకు భూమన సహకరిస్తున్నారన్నారు.
చంద్రబాబు ఎలా చెప్పారు
గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాపులను మోసం చేయవద్దని కాపు గర్జన జరిగిందని, ఆ ఉద్యమానికి మద్దతిచ్చిన వారికి నోటీసులు ఇవ్వడం సరికాదని వైసిపి నేత అంబటి రాంబాబు అన్నారు. తుని ఘటన జరగిన తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ.. ఇది జగన్ మనుషులే చేశారని చెప్పారన్నారు.
ఘటన జరగగానే విచారణ జరగాలని, ఆ తర్వాతే ఏమైనా చెప్పాలన్నారు. కానీ ఘటన జరగగానే జగన్ మనుషులు చేశారని చెప్పడం ఏమిటన్నారు. జగన్‌కు సంబంధించిన వారికి నోటీసులు ఇవ్వడం కక్షపూరితమైనదిగానే భావిస్తున్నామన్నారు.
అసెంబ్లీ సమావేశాలపై శ్రీకాంత్ రెడ్డి
అసెంబ్లీ సమావేశాలు మరిన్ని ఎక్కువ రోజులు నిర్వహించాలని వైసిపి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి వేరుగా అన్నారు. ఈ ప్రభుత్వం ప్రతి దానిని ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లా చేస్తోందని ఎద్దేవా చేశారు. కనీసం 15రోజులు అసెంబ్లీ సమావేశాలుండాలని, అధికార పార్టీ తప్పించుకునే ప్రయత్నాలు చేయవద్దన్నారు.












Click it and Unblock the Notifications