వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెచ్చరిక: 'నేను చిరంజీవి అభిమానినే, కానీ ఇప్పుడు నచ్చట్లా'

|
Google Oneindia TeluguNews

విజయవాడ: సినీ నటుడిగా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి అంటే తనకు ఇష్టమని, తాను ఆయన అభిమానిని అని, కానీ ఇప్పుడు ఆయన తీరు తనకు నచ్చడం లేదని ఏపీ కాపు కార్పోరేషన్ చైర్మన్ రామానుజయ అన్నారు.

బాబుని తప్పుపట్టిన దర్శకరత్న: 'దాసరి! జగన్ వలలో పడకండి'ఆయన వ్యవహార శైలితో కాపులలో ప్రతి ఒక్కరికీ బాధ కలుగుతోందన్నారు. కాపుల సంక్షేమాన్ని అడ్డుకునేందుకే చూస్తే, కాపు జాతి ఆగ్రహాన్ని చిరంజీవి చవి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కుట్రలో కొంతమంది చిక్కుకున్నారన్నారు.

AP Kapu Corporation Chairman Ramanujaya says he is fan of Chiranjeevi

జగన్ కుట్రలో చిక్కుకున్నందు వల్లే కొందరు నేతలు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును విమర్శిస్తున్నారని మండిపడ్డారు. కుట్ర చేస్తున్న వారితో చిరంజీవి చేరాడని, ఇది ఎంత వరకు సమంజసమో ఆలోచించాలన్నారు.

కాగా, ఆయన శనివారం నాడు చిరంజీవికి లేఖ రాసిన విషయం తెలిసిందే. చంద్రబాబు కాపుల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని, వాటికి అడ్డంకులు సృష్టిస్తే కాపు జాతి చిరంజీవిని క్షమించదని ఆ లేఖలో పేర్కొన్నారు.

చిరంజీవితో కాపులకు ఒరిగిందేమీ లేదు: బహిరంగ లేఖలో మండిపడ్డ రామానుజయమూడు రోజుల క్రితం ఆయన దాసరి నారాయణ రావుకు కూడా బహిరంగ లేఖ రాశారు. దాసరితో ముఖ్యమంత్రి చంద్రబాబు పైకి తుపాకీ ఎక్కుపెట్టేలా కాపు నేతలు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాపు కార్పోరేషన్ ద్వారా కాపు యువత అభివృద్ధికి సలహాలు ఇవ్వాలని ఆ లేఖలో దాసరిని కోరారు. దాసరి మాత్రం వైసిపి వలలో పడవద్దన్నారు.

కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇటీవల కాపు నేతలను వరుసగా కలిసి ఉద్యమానికి మద్దతు కోరిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా దాసరి నివాసంలో చిరంజీవి, ముద్రగడ, అంబటి రాంబాబు తదితరులు ఇటీవల కలిశారు. ఈ నేపథ్యంలో రామానుజయ.. చిరు, దాసరిలకు లేఖ రాశారు.

English summary
AP Kapu Corporation Chairman Ramanujaya says he is fan of Congress leader Chiranjeevi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X