జగన్ రెడ్డి కాదు జాదూ రెడ్డి.. మడమ తిప్పుడుకి బ్రాండ్ అంబాసిడర్ : రెచ్చిపోయిన లోకేష్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ రెచ్చిపోయారు. పాదయాత్రలో ప్రచారానికి పనికొచ్చిన నిరుద్యోగులు ఇప్పుడు పనికిరారా..? అని ప్రశ్నించారు. జాబ్ క్యాలండెర్ ఎక్కడ? అంటూ నిలదీశారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట మార్చుతున్నారని దుయ్యబట్టారు. మాటల మార్చుడు.. మడమ తిప్పుడుకి జగన్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని విమర్శించారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. జాదారెడ్డిగా మారారు..
ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ లెస్ క్యాలెండర్ విడుదల చేస్తున్నారని లోకేష్ నిప్పులు చెరిగారు. మాట మార్చుడు.. మడమ తిప్పుడుకి బ్రాండ్ అంబాసిడర్‌గా వైఎస్ జగన్ మారారని ఎద్దేవా చేశారు. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రతి జనవరి ఒకటికి జాబ్ క్యాలెండర్ దేవుడెరుగు ఉన్న కంపెనీలు పోకుండా ఉంటే చాలనుకునే రోజు తెచ్చారు జాదూ రెడ్డి అంటూ విమర్శలు గుప్పించారు.

ఉత్తుత్తి జాబ్ క్యాలండర్..
పాదయాత్రలో ప్రచారానికి పనికొచ్చిన నిరుద్యోగులు ఇప్పుడు పనికిరావడం లేదా అని లోకేష్ ప్రశ్నించారు. అధికారంలోకి రాక ముందు 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ అంటివి.. వచ్చిన తర్వాత మాత్రం ఉత్తుత్తి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ప్రతి జనవరి ఫస్ట్ కు జాబ్ క్యాలెండర్ లేదు.. అటు ప్రైవేటు ఉద్యోగాలు లేవు.. గతంలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన నిరుద్యోగ భృతి కూడా లేదని దుయ్యబట్టారు.

చేతకగాని పాలన వల్లే.. ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రం..
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తున్న ఉద్యోగులకు ఇచ్చిన హామీలను సీఎం జగన్ ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు . అదికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని ఆనాడు చెప్పారు. కానీ మూడేళ్లు కావొస్తున్న ఇప్పటి వరకు దానిని ఎందుకు రద్దు చేయలేదని నిలదీశారు. పీఆర్సీపై ఉద్యోగులను చర్చలకు పిలిచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి పంపిస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం జగన్ చేతగాని పాలన వల్లే రాష్ట్రం ఆర్థికి ఇబ్బందుల్లో కూరుకుపోయిందని విమర్శించారు. టీడీపీ పాలనలో ఆర్థిక లోటు ఉన్నా.. నాడు చంద్రబాబు ఉద్యోగలుకు 43 శాతం పిట్మెంట్ ఇచ్చారని అశోక్ బాబు గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications