అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'జడ్జిలను మార్చి జగన్ కేసు మొదటికి తెచ్చారు, జైలుకు ఎందుకు పంపించలేదు'

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత, మంత్రి నారా లోకేష్ సోమవారం నిప్పులు చెరిగారు. మోడీ ఏపీకి వచ్చి అబద్దాలు అడారని, అవినీతిపరుడు అయిన జగన్‌ను జైల్లో పెట్టలేదని దుయ్యబట్టారు. ఏపీకి న్యాయం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు తమకు ఉందని చెప్పారు. చంద్రబాబు ఢిల్లీలో దీక్ష చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడారు.

మాటకు మాట: 'గో బ్యాక్'ను పాజిటివ్‌గా తీసుకున్న మోడీ, బాబుకు ఆరు గట్టి చురకలివే! నవ్విన పురంధేశ్వరిమాటకు మాట: 'గో బ్యాక్'ను పాజిటివ్‌గా తీసుకున్న మోడీ, బాబుకు ఆరు గట్టి చురకలివే! నవ్విన పురంధేశ్వరి

 రాజీనామా చేశారు

రాజీనామా చేశారు

తాము వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్‌లో పడ్డామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పడం విడ్డూరమన్నారు. బీజేపీయే జగన్ ట్రాప్‌లో పడిందని తెలిపారు. ప్రత్యేక హోదా, ఏపీకి విభజన హామీల కోసం తమ పార్టీకి చెందిన నేతలు కేంద్రమంత్రి పదవులకు రాజీనామా చేశారని చెప్పారు. అద్భుతమైన ప్యాకేజీ, హోదా ఇస్తామని చెప్పి నమ్మించారని ధ్వజమెత్తారు. తమకు ప్రత్యేకహోదాతో పాటు విభజన చట్టంలోని 18 హామీలు నెరవేర్చాలన్నారు.

 వైసీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు

వైసీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు

మరో డెబ్బై రోజుల్లో ప్రధాని నరేంద్ర మోడీ దిగిపోవడం ఖాయమని లోకేష్ చెప్పారు. కొత్త ప్రభుత్వం రాగానే ఏపీకి ప్రత్యేక హోదా సాధించి తీరుతామని చెప్పారు. మోడీ, జగన్‌ల జోడీ వ్యవహారం గుంటూరు సభతో మరోసారి తేలిపోయిందని చెప్పారు. మోడీకి స్వాగతం పలుకుతూ వైసీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని ఆరోపించారు. ప్రత్యేక హోదా, విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీసే హక్కు తమకు రాజ్యాంగం ఇచ్చిందన్నారు.

జడ్జిలను మార్చి జగన్ కేసులను మొదటికి తెచ్చారు

జడ్జిలను మార్చి జగన్ కేసులను మొదటికి తెచ్చారు

ఏపీ ప్రజలకు మోడీ వెన్నుపోటు పొడిచారని లోకేష్ ధ్వజమెత్తారు. తనపై ఒక్క అవినీతి ఆరోపణ లేదని చెప్పారు.అవినీతిపరులను జైలుకు పంపుతానని చెప్పిన నరేంద్ర మోడీ దానిని నిలబెట్టుకోలేదని, జగన్‌ను ఎందుకు జైలుకు పంపించలేదో చెప్పాలన్నారు. జడ్జిలను మార్చి జగన్ కేసులను మొదటికి తెచ్చారన్నారు.

English summary
Andhra Pradesh IT Miniter and Telugudesam Party leader Nara Lokesh on monday questioned PM Narendra Modi about YSRCP chief YS Jagan Mohan Reddy's DA case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X