Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కుప్పంలో నా చెంపలు పగలగొట్టారని వైసీపీ నేతల శున‌కానందం; కానీ వైఎస్ జగన్ బట్టలూడదీసి.. షాకిచ్చిన లోకేష్

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కంచుకోట అయిన కుప్పం మున్సిపల్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ చావు దెబ్బ తింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుప్పంలో విజయకేతనం ఎగురవేసింది. చంద్రబాబు కంచు కోటలో వైసీపీ జెండా ఎగిరింది. ఊహించని రీతిలో టీడీపీ ఘోర పరాజయం పాలు కాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఇప్పుడు విమర్శలు ప్రతి విమర్శల పర్వం మరోసారి సెగలు పుట్టిస్తుంది

 కుప్పంలో నువ్వా నేనా అన్నట్టు తలపడినా వైసీపీ విజయం , టీడీపీ పరాజయం

కుప్పంలో నువ్వా నేనా అన్నట్టు తలపడినా వైసీపీ విజయం , టీడీపీ పరాజయం

మొదటి నుంచి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కుప్పం ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వైసీపీ తరఫున కుప్పంలో రంగంలోకి దిగిన మంత్రులు టీడీపీని టార్గెట్ చేస్తూ ప్రచారాన్ని నిర్వహించగా, తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించిన లోకేష్ కుప్పం ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్తారని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఊహించని విధంగా కుప్పం నియోజకవర్గంలో వైసీపీ విజయం సాధించడంతో వైసీపీ మంత్రులు టిడిపిని టార్గెట్ చేస్తున్నారు. మొత్తం కుప్పం మున్సిపాలిటీలో 25 స్థానాలకు ఎన్నికలు జరగగా, 18 స్థానాలలో అధికార వైసీపీ విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ కేవలం ఆరు స్థానాలకే పరిమితం కావలసి వచ్చింది.

కుప్పం విజయంపై వైసీపీ అలా.. విజయమే కాదంటూ టీడీపీ ఇలా

కుప్పం విజయంపై వైసీపీ అలా.. విజయమే కాదంటూ టీడీపీ ఇలా

ఇది వైసిపి పట్ల ప్రజల ఆదరణ అని, జగన్ సర్కార్ ను ప్రజలు ఆదరిస్తారని వైసీపీ నేతలు తేల్చి చెబుతున్నారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని, టిడిపిని మూసి వేయాల్సిందే అని, నారా లోకేష్ వల్ల తెలుగుదేశం పార్టీ మరింత దెబ్బతింటుందని, లోకేష్ ప్రచారం చేసిన కుప్పంలోనూ ఓటమి పాలు కావడం అందుకు నిదర్శనమే పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు వైసీపీ నేతలు. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ మాత్రం కుప్పం ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అంగీకరించడం లేదు. పుంగనూరు ఇతర ప్రాంతాల నుండి దొంగ ఓటర్లను తీసుకువచ్చి ఓట్లు వేయించారని, పోలీసులు ఎన్నికల సంఘం అధికారులు వైసీపీకి వత్తాసు పలికారని , తెలుగుదేశం పార్టీ నేతలను, పార్టీ కార్యకర్తలను అడుగడుగునా ఇబ్బందులకు గురి చేసి భయభ్రాంతులు సృష్టించారని, ఇక ఇది గెలుపే కాదని టిడిపి నేతలు తేల్చి చెబుతున్నారు.

 కుప్పంలో వైసీపీది గెలుపేనా అంటూ ప్రశ్నిస్తున్న టీడీపీ

కుప్పంలో వైసీపీది గెలుపేనా అంటూ ప్రశ్నిస్తున్న టీడీపీ

ఇప్పటికే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దొంగ వోట్లతో గెలిచి సిగ్గు శరం లేకుండా సంబరాలు జరుపుకుంటున్నారు అంటూ మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఎలా గెలిచింది అనేది ప్రజలందరూ చూశారని, దమ్ముంటే సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాలని సార్వత్రిక ఎన్నికలలో ఓటమి పాలైతే టిడిపిని మూసేస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే కుప్పంలో ఎన్నికల ప్రచారం నిర్వహించి వైసీపీ పై తీవ్రస్థాయిలో విరుచుకు పడిన లోకేష్ కుప్పం ఎన్నికల ఫలితాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు.

కుప్పం ఫలితాలపై లోకేష్ ఘాటు వ్యాఖ్యలు


దొంగ ఓట్లు,వంద‌ల కోట్లు,గూండాగిరీ, అధికారులు-పోలీసుల అండ‌తో కుప్పంలో గెలిచామ‌ని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు అంటూ లోకేష్ మండిపడ్డారు. ప్ర‌జ‌లు లోకేష్ రెండు చెంపలు పగలగొట్టారని శున‌కానందంలో ఉన్నారు వైసీపీ నేతలు అంటూ పేర్కొన్న లోకేష్ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఫ్యాన్‌కి వ్యతిరేకంగా ఓటేసి, వైయస్ జగన్ ని బట్టలూడదీసి వాయ‌గొట్టార‌నేది బులుగుబుర్రలకి ఎప్పుడెక్కుతుందో? అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. కుప్పం ఎన్నికలలో ఓటమి పాలైన అప్పటికీ లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఆ ఓటమిని అంగీకరిస్తున్నట్టు లేకపోగా, ఏపీలో టిడిపి పుంజుకున్న విషయాన్ని లోకేష్ చెప్తున్నట్లుగా స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో వైసిపికి వ్యతిరేకత పెరిగింది అన్న విషయాన్ని లోకేష్ తన కామెంట్స్ ద్వారా వ్యక్తం చేశారు.

వైసీపీ గెలుపు బలుపు కాదు వాపు మాత్రమే : టీడీపీ ఎమ్మెల్సే అశోక్ బాబు

ఇదిలా ఉంటే వైసీపీ గెలుపు బలుపు కాదు వాపు మాత్రమే అంటూ టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు ఎన్నికల్లో వైసీపీ విజయం పై మండిపడ్డారు. కుప్పం లో జరిగింది ఎన్నికలే కాదంటూ తీవ్రపదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఇదే నైతిక విజయం అని ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజీలేని పోరాటం కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. గత మున్సిపల్ ఎన్నికలలో వైసిపి దౌర్జన్యాలు దారుణాలను కొనసాగించిన సమయంలో 30 శాతం టిడిపి కి ఓటింగ్ వస్తే, ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల అదే వైసిపి దారుణాలు దౌర్జన్యాల మధ్య దాదాపు 46 శాతం ఓటింగ్ టిడిపికి వచ్చిందని టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు స్పష్టం చేశారు.

వైసిపికి సమాధి కట్టడానికి ముహూర్తం ఫిక్స్ అయిందన్న టీడీపీ ఎమ్మెల్సీ

వైసిపికి సమాధి కట్టడానికి ముహూర్తం ఫిక్స్ అయిందన్న టీడీపీ ఎమ్మెల్సీ

ప్రజల్లో మార్పు ప్రారంభమైందని, వైసిపికి సమాధి కట్టడానికి ముహూర్తం ఖరారు అయిందని ఎమ్మెల్సీ అశోక్ బాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీకి ప్రజాదరణ పెరిగిందని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఈ ఎన్నికల విజయం సీఎం జగన్ మోహన్ రెడ్డిది కాదని ఈ విజయం డీజీపీది అంటూ అశోక్ బాబు ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు సీఎం జగన్ మోహన్ రెడ్డి ని కలవడం కాదని, అందరు వెళ్లి ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను తమను గెలిపించినందుకు సత్కరించాలని ఎద్దేవా చేశారు. పోలీసుల సహకారం ఉండటం వల్లే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందని ఎమ్మెల్సీ అశోక్ బాబు పేర్కొన్నారు. 2024లో వైసిపి ఆటలు సాగవని ఆయన స్పష్టం చేశారు .

Recommended Video

    NTR ని TDP నుండి సస్పెండ్ చేసి.. ఇప్పుడు నాటకాలా.. Vijaysaireddy మాస్ ట్రోలింగ్ || Oneindia Telugu
     కుప్పంలో ఓడిపోతేనే టీడీపీ ఓడినట్టు కాదు : అశోక్ బాబు

    కుప్పంలో ఓడిపోతేనే టీడీపీ ఓడినట్టు కాదు : అశోక్ బాబు

    కేవలం కుప్పంలో ఓటమి పాలైతే అయితే తెలుగుదేశం పార్టీ ఓడిపోయినట్లు కాదని ఆయన పేర్కొన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇది బలుపు గాదు వాపు అని అర్థం చేసుకోవాలని హితవు పలికారు. అప్పుడే అంతగా ఎగిరితే ఎలా అంటూ ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు ప్రారంభం అయిందని వారి డ్రామాలు సాగవని టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శించారు. దర్శి లో ఓటమిపాలైనందుకు ప్రకాశం జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రి రాజీనామా చేయాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు. సంవత్సరం పాటు జీతం తీసుకునే వైసీపీ ఎమ్మెల్యే లకు ఒక్క రోజు అసెంబ్లీకి వెళ్తారా.. దేనికి అంటూ ప్రశ్నించారు. వైసిపి ఎమ్మెల్యేలకు సిగ్గు ఎగ్గు ఉందా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+