జగన్ పిచ్చి పరాకాష్టకు చేరింది; విజయనగరం మహారాజా ఆస్పత్రి పేరు మార్పుపై లోకేష్ ధ్వజం!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు, భవనాల పేర్ల మార్పు కొనసాగుతుంది. ఇప్పటికే ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీ గా మార్పు చేయడంపై ప్రతిపక్ష పార్టీల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా టిడిపి శ్రేణులు ఆందోళన చేశారు. ఇది ఎంత మాత్రం సమంజసం కాదన్నారు. ఇక ఆ వివాదం సద్దు మణగక ముందే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

మహారాజా ప్రభుత్వ ఆస్పత్రి పేరు మార్చిన జగన్ సర్కార్.. టీడీపీ ఫైర్

మహారాజా ప్రభుత్వ ఆస్పత్రి పేరు మార్చిన జగన్ సర్కార్.. టీడీపీ ఫైర్

విజయనగరంలో ఉన్న మహారాజా ప్రభుత్వాసుపత్రి పేరును కూడా మార్చాలని నిర్ణయం తీసుకుంది. జగన్ సర్కార్ ఈ మేరకు మహారాజా జిల్లా కేంద్ర ఆసుపత్రి పేరును ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి గా మార్చింది. ఇక జగన్ సర్కార్ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు సైతం తీవ్రంగా తమ ప్రభుత్వ నిర్ణయంపై తమ వ్యతిరేకత తెలియజేస్తున్నారు.

జగన్ పిచ్చి పరాకాష్టకు చేరిందన్న లోకేష్

జగన్ ను ట్విట్టర్ వేదికగా టార్గెట్ చేసిన నారా లోకేష్ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పిచ్చి పరాకాష్టకు చేరుకుంది అని విమర్శించారు. సీఎం జగన్ మహనీయులను అవమానించడమే పనిగా పెట్టుకున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చి పెద్ద తప్పు చేశారని మండిపడిన లోకేష్, విజయనగరం మహారాజ ప్రభుత్వ ఆసుపత్రి పేరు మార్చి ప్రజల మనోభావాలను జగన్మోహన్ రెడ్డి దెబ్బతీస్తున్నారని విమర్శించారు.

తమ విలువైన భూమి ఆస్పత్రికి ఇస్తే మహారాజా పేరు తొలగిస్తారా? లోకేష్ ఫైర్

తమ విలువైన భూమి ఆస్పత్రికి ఇస్తే మహారాజా పేరు తొలగిస్తారా? లోకేష్ ఫైర్


మహారాజా కుటుంబం అప్పుడు ప్రజల సంక్షేమం కోసం నిర్మించతలపెట్టిన ఆసుపత్రికి విలువైన భూమిని ఇచ్చేసిందని లోకేష్ తన ట్వీట్ లో వెల్లడించారు. అలాంటి గొప్ప ఔదార్యం ఉన్న మహారాజా పేరు ఉంటే తప్పేంటి అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రిగా నిధులు కేటాయించి అశోక్ గజపతిరాజు ఆసుపత్రిని అభివృద్ధి చేశారని, అటువంటి ఆసుపత్రికి, రాత్రికి రాత్రి మహారాజా పేరును తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అంటూ లోకేష్ ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఆసుపత్రికి మహారాజా పేరును కొనసాగించాలని లోకేష్ డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+